పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్యాలనూ నరుని పాదాల క్రింద ఉంచావు" అన్నాడు. భూమి విూది ప్రాణికోటికంతటికీ నరుడు అధిపతి అని భావం = 8,8.

రెండవది, నరుడు దేవుని పోలిక కలవాడు అంటే, అతడు దేవుని పోలిన మరో నరుడ్డి కనగలడని గూడ్ల భావం. ఆదాము నూటముప్పది యేండ్ల యిూడున తనకు పోలిగా వుండే కుమారుడ్డి కని అతనికి షేతు అని పేరు పెట్టాడట - ఆది 5,3. ఈ వాక్యం ప్రకారం షేతులో అతని తండ్రి ఆదాము పోలిక వుంది. ఈ వాక్యం “దేవుడు తనకు పోలికగా నరుడ్డి చేసాడు" అనే విూది వ్యాకం లాంటిదే - ఆది 1,27. అనగా దేవుడు తనకు పోలికగా ఆదామను చేసినట్లే ఆదాము కూడ తనకు పోలికగా షేతుని చేసాడు అని భావం. కనుక దేవుని పోలిన నరుడు, దేవుని పోలిన ఇతర నరులను కూడ కనగలడని అర్థం.

 మూడవది, నరుడు దేవుని పోలినవాడు అంటే అతడు అమరుడు అని కూడ భావం. అతడు దేవునిపోలిన తోడి మానవులను సృజించుకొంటూ పోయేవాడు. చావలేని వాడు. తొలి మానవునికి జరామరణాలు లేవు. పాప ఫలితంగా అతడు మరణానికి గురయ్యాడు. "దేవుడేమో నరుణ్ణి తనకు పోలికగా చేసాడు. అతన్ని తనలాంటి వాణ్ణిగాను అమరుణ్ణి సృజించాడు. కాని పిశాచం అసూయ వలన మరణం లోకం లోనికి ప్రవేశించింది" అంటుంది సొలోమోను జ్ఞానగ్రంథం - 2,23-24. ఈ వాక్యం ప్రకారం దేవుని పోలికగల తొలినరుడు అమరుడు. పాపం అతన్ని మరణపీడితుణ్ణి చేసింది.
 
కనుక నరుళ్ళే దేవుని పోలికవుంది అంటే అతడు భూమికంతటికి అధిపతి అనీ, తోడినరుణ్ణి కలిగించగలవాడు అనీ, అమరుడు అనీ మూడు ప్రధాన భావాలున్నాయి. ఇంకా మనలోని ෂෂg బుద్ధిశకీ, స్వాతంత్ర్యమూ, మనం దేవుని కుమారులం గావడమూ, పరిశుదులంగా మెలగడమూ మొదలైన లక్షణాలు కూడ ఈ పోలికవల్లనే సిద్ధించాయి. కాబట్టి నరులంగా మనకున్న విలువంతా ఈ పోలికలోనే వుంది అనాలి.

2. క్రీస్తు దేవునికి పోలికగా వుంటాడు


నూత్న వేదం చాలతావుల్లో క్రీస్తు దేవునికి పోలికగా వుంటాడని చెప్తుంది. "ఏ నరుడూ ఎప్పడూ దేవుణ్ణి చూడలేదు. కాని దేవునికి అతి సన్నిహితంగా వుండే కుమారుడు అతన్ని మనకు తెలియజేసాడు" - యోహా 1,18. ఈ వాక్యం భావం ఇది. కుమారుడైన క్రీస్తు తన తండ్రిలాంటివాడు. అతని పోలిక కలవాడు. కనుక అతడు ఆ తండ్రిని గూర్చి మనకు తెలియజేయగలడు.

 ఓమారు ఫిలిప్ప క్రీస్తుతో "ప్రభూ! మాకు తండ్రిని చూపించు, అంతేచాలు" అన్నాడు. అందులకు క్రీస్తు తన్ను జూచినవాడు తన తండ్రిని చూచినట్లేనని జవాబిచ్చాడు