పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ ప్రవచనంలో ప్రవక్త ముసలివాళ్ళపట్లా పిల్లలపట్లా కనపరచిన ఆదరాన్ని అర్ధం జేసుకోవాలి. మన బళ్ళల్లో గుళ్ళల్లో బోలెడంత మంది పిల్లలు మెదులుతూంటారు. కాని వాళ్ళను మనం ఏపాటి ఆదరంతో చూస్తుంటాం? ఏపాటి పేమతో పరామర్శిస్తుంటాం?

8. ఇటీవలే అంతర్జాతీయ బాలల సంవత్సరం జరిపాం. ఈ సంఘటనం పెద్దవాళ్ళకు మల్లె పిల్లలకు గూడ కొన్ని హక్కులుంటాయని తేటతెల్లం చేసింది. విద్య వైద్యం, ఆరోగ్యం, ఆహారం, అనురాగం, భద్రత, పేరు, పౌరత్వం మొదలైన వాటిని పొందె హక్కు బాలలందరికి పంది. మన తరపున మనం మన అధీనంలో వున్న బాలలు" ఈ హక్కులన్నిటినీ పొందేలా చూడాలి. వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి, అప్పడు "నా పేరు విూదిగా ఓ చిన్నబిడ్డను స్వీకరించినవాడు నన్ను స్వీకరించినట్లే" అన్నవాక్యాన్ననుసరించి ప్రభువు దీవెన పొందుతాం - మత్త 18,5.

2. దేవుని పోలిక

దేవుడు నరుడ్డి తనకు పోలికగా చేసాడు - ఆది 9,6. నరుని గొప్పతనమంతా ఈ పోలికలోనే వుంది. కనుక దేవుని పోలివుండడమంటే యేమిటో పరిశీలిద్దాం.

1. నరుడు దేవునికి పోలికగా వుంటాడు

పూర్వవేదం విగ్రహాలను చేయవద్దంటుంది. ప్రభువు విగ్రహం కూడ చేయకూడదని శాసిస్తుంది. యావే ప్రభువు నరునికి అందుబాటులో వుండేవాడు కాదు. అతడు మనుష్య లోకానికి దూరంగా వుండేవాడు. అలాంటి దూరవర్తియైన ప్రభువుని మన మధ్యలో వున్నట్లుగా ఓ విగ్రహం ద్వారా, అనగా ఓ ఆకారమూ లేక పోలిక ద్వారా ప్రదర్శించకూడదని చెప్పంది బైబులు - ద్వితీ 27, 15, కాని ఈలా పోలిక ద్వారా ప్రదర్శించడానికి వీలులేని దేవునికి నరుడు పోలికగా వుంటాడు అని చెప్పంది ఆదికాండం – 1,27. కనుక ఈ నరుళ్ళి అనన్య సామాన్యమైన మాహాత్మ్యం ఏదో వండివుండాలి. ఆ దేవునికి పోలికగా వుండడమంటే సామాన్యమా మరి?

నరుడు దేవునికి పోలికగా వుంటాడు అంటే అర్థం ఏమిటి? ఈ పోలికలో మూడు ప్రధాన లక్షణాలున్నాయి. మొదటిది, ఆధిపత్యం. ఈ సృష్టికంతటికీ దేవుడు అధిపతి, కాని ఈ నేల విూద మాత్రం దేవునికి బదులుగా, అతని ప్రతినిధిగా, నరుడు • అధిపతిగా వుంటాడు. దేవుడే నరుడ్డి ఈ భూమికంతటికీ అధిపతినిగా నియమించాడు. కనుకనే కీర్తనకారుడు "ప్రభో! నీవు ఎడ్లనూ, గొర్రెలనూ, ఆకాశపక్షులనూ, సముద్ర