పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13. ప్రభువు పవిత్రుడు

బైబులు భగవంతుడు మహాపవిత్రుడు. ఈ సంగతిని గుర్తించక క్రైస్తవులమైన మనం మంచినీళ్ళ త్రాగినంత సులభంగా పాపం చేస్తూంటాం, ఈలా చేయడం తగదు. మనం కొలిచే పవిత్ర ప్రభువు మనంకూడ తనలాగే పవిత్రులంగా వుండాలని కోరుకొంటాడు. మోషేలాంటి మహాభక్తులే పరిశుద్ధుడైన ఆ ప్రభువైపు తేరిపారజూడలేక ముఖం కప్పేసుకున్నారు అంటే, పాపులమైన మనం ఆ దేవుణ్ణి ఆరాధించగలమా? ఐనా ఆ ప్రభువే మన హృదయాన్ని శుద్ధిచేసి మనలను తన్నారాధించే ప్రజలనుగా
తయారుచేస్తాడు.
1.ప్రభువు పరిశుధుడు, పరిశుధుడు, పరిశుదుడు
 ప్రపంచమంతా ఆయన మహిమతో నిండివుంది - యొష 6,3
2. ప్రభువువలె పరిశుద్ధుడైనవా డెవడూ లేడు
 అతనిలాంటివాళ్ళు లేరు
 అతనిలాగ రక్షించేవాళ్ళూ లేరు - 1సమూ 2,2
3. దేవుని యెదుట ఏ నరుడైనా పుణ్యాత్ముడుగాను
 నిర్మలుడుగాను పరిగణింపబడతాడా?
ఆయన కంటికి చంద్రుడే స్వచ్ఛంగా వుండడు
 నక్షత్రాలే నిర్మలంగా వుండవు
 మరి ఓ క్రిమీ కీటకమూ వంటివాడైన నరుడెంత?
 దేవుని ముందట నరుని విలువెంత? - యోబు 25, 4-6
4. దేవుని ముందట ఏ నరుడైనా
పుణ్యాత్ముడుగా గణింపబడతాడా?
సృష్టికర్త ముందట ఏ జనుడైనా
 నిర్మలుడుగా కన్పిస్తాడా?
 ప్రభువు స్వర్గంలోని దూతలనే నమ్మడు
 ఆయనకు దేవదూతల్లోనే లోపాలు కన్పిస్తూంటాయి
 మరి ఆ ప్రభువు ఓ మట్టిమానిసిని నమ్ముతాడా?
 పరుగులా కాలిక్రిందబడి నలిగిపోయే
 ఓ దుమ్ము మానసిని లెక్కజేస్తాడా? - యోబు 4,17-19
5. మీ దేవుజ్జీ ప్రభువనీ ఐన నేను పరిశుధుణ్ణి. కనుక మీరూ
పరిశుద్దులై యుండాలి — లేవీ 19,2
242