పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5.నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను?
 నీ సన్నిధి నుండి పారిపోయి యొక్కడికి వెళ్ళగలను?
నేను ఆకాశానికి ವತ್ತೆ నీవు అక్కడుంటావు
పాతాళానికి వెత్తే అక్కడా వుంటావు
 రెక్కలు కట్టకొని మిన్నులు పడ్డచోటికి ఎగిరిపోతే
 అక్కడా నీవు నన్ను ఆదుకోవడానికి సిద్ధంగా వుంటావు
 చీకటిలో దాగుకొందామనుకొన్నా
 నా చుటూరా వున్న వెలుతురు చీకటి కావాలని కోరుకొన్నా
 చీకటి నీకు చీకటిగా వుంటుందా?
చీకటిగూడ నీకు పగలుగాదా?
 రేయింబవళ్ళ నీకు సమానం గాదా? - కీర్త 139, 7–12
6. దేవుడు నా ప్రక్కగా పోతున్నా నేనతన్ని గుర్తు పట్టలేకుండా వున్నాను - యోబు 9,11
7.మన ప్రభువులాంటి దేవుడు లేనేలేడు
ఆయన మహోన్నతమైన ఆకాశంలో వుంటాడు
 ఐనా క్రిందికి వంగి భూమిమీదికి పారజూస్తూంటాడు
 దీనులను దుమ్ములోనుండి పైకి లేపుతాడు
 అక్కరలోనున్నవారి యిక్కట్టలను తొలగిస్తూంటాడు - కీర్తన 113, 5–7
8. ప్రభో! జీవించివున్న ప్రతి ప్రాణినీ నీవు ఆదరంతో చూస్తూంటావు. నీవు సృజించిన జీవులను వేటినీ నీవు అసహ్యించుకోవు. అసహ్యించుకొనేవాడివైతే నీవు వాటిని
"కలిగించేవుండవు. నీవు పుట్టించందే ఏ ప్రాణి పడుతుంది? నీవు సంరక్షించందే
ఏజీవి మనుతుంది? ప్రతి ప్రాణి నీదే గనుక నీవు ప్రాణులన్నిటినీ ఆదరిస్తూంటావు. నీకు ప్రాణమంటే యిష్టం. నాశంలేనినీయాత్మప్రతి ప్రాణిలోను నెలకొని వుంటుంది - జ్ఞాన 11, 24 -12,1
9. మీరు లోతైన నీళ్ళను దాటిపోయేప్పుడు నేను మీతో వుంటాను. మీ బాధలు మిమ్మ క్రుంగదీయలేవు. మీరు నిప్పమంటలగుండా నడచిపోయేప్పడు ఆ మంటలు మిమ్మ కాల్చివేయలేవు. మీ కడువచ్చే యాతనలు మిమ్మ బాధించలేవు, మీ దేవుడనూ యిప్రాయేలు కొలిచే ప్రభువునూ ఐన నేను మిమ్మ తప్పక రక్షిస్తాను - యోష 43,2
10. ప్రతి తరానా ప్రభువు జ్ఞానం కొంతమంది భక్తులను అవేసిస్తుంది. వాళ్ళను దేవుని స్నేహితులుగాను ప్రవక్తలుగాను మారుస్తుంది - జ్ఞాన 7,27
11.మనం ఆ ప్రభువులో మనుతూంటాం, జీవిస్తూంటాం, చలిస్తూంటాం – అచ 17,28.
241