పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవు మేతపెడితే సంతృప్తి చెందుతూంటాయి
 కాని, నీవు మరుగైపోతే అవి వ్యాకులపడతాయి
నీవు ఊపిరితీస్తే అవన్నీ చచ్చిపోతాయి
ఏ మట్టినుండి పట్టాయో ఆ మట్టిలోనే కలసిపోతాయి
 నీవు ఊపిరిపోయగా అవి బ్రతుకుతాయి
 ఈ విధంగా నీవు భూమిమీద ఎప్పటికప్పుడు
క్రొత్త ప్రాణులను సృజిస్తూంటావు - 104, 27-30

8.ప్రాణులన్నీ ఆశతో నీవైపు చూస్తుంటాయి
 వాటికి ఆకలైనప్పడు నీవు ఆహారం పెడతావు
 నీవు ప్రాణుల కవసరమైనంతగా ఆహారం ఇస్తూంటావు
 వాటి ఆశ తీర్చుతూంటావు
 ప్రభువు ఎల్లవేళలా నీతిమంతుడే
 అతని కార్యాలన్నీ దయాపూరితాలే - 145, 15-17

9.ఎత్తయిన కొండల్లో అడవి మేకలు నివసిస్తాయి
 కొండబొరియల్లో కుందేళ్ళ జీవిస్తుంటాయి
 ఋతువులను తెలిపేందుకు నీవు చంద్రుణ్ణి చేసావు
 సూర్యునికి తానెప్పడు అస్తమించాలో తెలుసు
నీవు రాత్రిని కలిగించావు
 చీకటిలో వన్యమృగాలు సంచారం చేస్తుంటాయి
 సింగపు కొదమలు గర్ణిస్తూ వేటకు వెళ్తాయి
 నీ విచ్చే ఆహారాన్ని వెదుకుకొంటాయి
 సూర్యోదయం కాగానే ఆ మృగాలన్నీ తిరిగివచ్చి
 తమ గుహల్లో దాగుకొంటాయి
 అప్పడు నరులు తమ పనికి బయలుదేరుతారు
సూర్యాస్తమయం వరకు పనిచేసుకొంటారు
ప్రభో! నీవు ఎన్ని ప్రాణులను సృజించావు!
తెలివితేటలతో వాటినన్నిటినీ కలిగించావు గదా!
 ఈ భూమి నీవు సృజించిన ప్రాణులతో
క్రిక్కిరిసివుంది -104, 18-24