పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వన్యమృగాలన్నిటికీ ఆహారం చేకూర్చిపెడుతుంటాడు
 కాపకాపమని అరచే కాకిపిల్లలను పోషిస్తూంటాడు - 147,8-9

4.నీవు భూమిని సందర్శించి దానిమీద వాన కురిపిస్తావు
 దానిని మహైశ్వర్యంతో నింపుతావు
 నీ కాలువలు నీటితో నిండివుంటాయి
అవి ధాన్యా న్నొసగుతాయి
నీవు చేసిన కార్యమిది
నీవు కుండపోతగా వాన కురిపించి నేల దుక్కలు తడుపుతావు
 మట్టి పెళ్ళలను కరిగించి చదును చేస్తావు
 జల్లలతో మట్టిని నానిస్తావు
ఆ మట్టినుండి మొలచిన మొలకలకు పెంపు నొసగుతావు
 నీ మంచితనంతో సంవత్సరాన్ని
 పంట అనే కిరీటంతో అలంకరించావు
నీవు నడచిన తావులందెల్ల సమృద్ధి నెలకొంది
 ఎడారి పొలాలు పచ్చబడ్డాయి
కొండ నేలల్లో ఆనందం నెలకొంది
 పచ్చిక పట్టల్లో గొర్రెల మందలు వస్తాలు కప్పినట్లుగా వున్నాయి
 లోయల్లో గోదుమ పైరు కంబళ్లు పరచినట్లుగా వుంది
 పొలాలన్నీ ఆనందంతో పాటలు పాడుతున్నాయి - 65,9-13

6.నీవు లోయల్లోని చెలమల్లోనుండి నీళ్ళు ఉబికి వచ్చేలా చేస్తావు
కొండలమధ్య నీళ్ళు వెల్లవలై పారతాయి
 పొలాల్లో తిరిగే మృగాలన్నీ నీళ్లు త్రాగుతాయి
 అడవి గాడిదలు దప్పిక తీర్చుకొంటాయి
 నీటియొడ్డున ఎదిగే చెట్ల కొమ్మల్లో పక్షులు గూళ్ళు కట్టుకొని
 కమ్మగా పాడుతుంటాయి -104, 10-12

6.సింహాలు కూడ ఆహారం దొరక్క అలమటిస్తాయి
 ప్రభుని ఆశ్రయించేవాళ్ళకు మాత్రం ఏ కొరత వుండదు -34,10

7.ప్రాణులన్నీ ఆకలైనపుడు నీవైపు చూస్తుంటాయి
 నీవు ఆహారంపెడితే తింటూంటాయి