పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వానకోయిలగూడ గూడుపెట్టింది
అవి నీ పీఠాల దగ్గరే పిల్లలను చేసాయి
నీ దేవాలయంలో వసిస్తూ నిన్ను కీర్తిస్తూండేవాళ్ళ
ఎంతటి ధన్యులో కదా! - 84, 3-4

5.ప్రభూ! అన్యుల యిండ్లల్లో వేయిదినాలు గడిపిందానికంటె
నీ మoదిరoలో ఒక్కరోజు గడిపింది మేలు
దుపుల యిండ్లల్లో వసించే దానికంటె
నీ మందిర ద్వారంవద్ద పడివుండడం మేలు - 84,10

6.ప్రభూ! దప్పిగొనిన దుప్పి
సెలయేటి నీళ్ళకుమల్లె
నా హృదయమూ నీ కోసం తహతహలాడుతుంది
సజీవుడైన దేవునికోసం నా హృదయం తపించిపోతుంది
నే నెప్పడెప్పడు ప్రభువు ముఖారవిందాన్ని దర్శిస్తానా అని
ఉవ్విళ్ళూరి పోతున్నాను - 42,1-2

7.దేవా! నీవు నాకు దేవుడవు
నేను నీ కొరకు ఉబలాటం చెందుతున్నాను
నీ కొరకు ఆశగొని యున్నాను
నీళ్ళలేక యెండి మాడియున్న నేలవలె
నా యాత్మ నీ కొరకు దప్పిక గొంటూంది - 63,1

8.ప్రభో చేతులెత్తి నీకు ప్రార్థన చేస్తున్నాను
ఎండిన నేలలాగ నా హృదయం నీకోసం తపించిపోతూంది - 143,6

9.నేను ప్రభువుకోసం వేచివున్నాను
ఆయన మాట నేను నమ్మాను
కావలివాళ్ళ వేకువజాము కొరకులాగే
నా హృదయంకూడ ప్రభువుకొరకు కనిపెట్టుకొనివుంది - 130, 5-6

10.నేను పడక మీద మేను వాల్చి నిన్ను స్మరించుకొంటూంటాను
రాత్రంతా నిన్ను గూర్చి తలంచుకొంటూంటాను
ఎప్పడూ నన్ను ఆదుకొంటూంటావు
నీ రెక్కల మరుగున నేను సంతోషంతో పాడతాను
నేను నీకు అంటిపెట్టుకొని వుంటాను
నీవు నన్ను సురక్షితంగా వుంచుతావు - 63, 6-8