పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. భగవంతుని మీద కోర్కె

భక్తునికి భగవంతుణ్ణి దర్శించాలనే s గాఢంగా వుంటుంది, అతడు కలకాలమూ ప్రభు మందిరంలోనే నివసించగోరుతాడు. ప్రభుని ప్రసన్నుద్ధి చేసుకోవాలనీ, ఆయనను సంప్రతించి చూడాలనీ ఉవ్విళ్ళూరిపోతాడు. ఓమారు అతడు ప్రభువు మందిరము ప్రవేశించి అటూ యిటూ పరిశీలించి చూచాడు, పిచ్చుకలూ వానకోవిలలూ దేవాలయంలో గూళ్ళు పెట్టుకొని వున్నాయి. దేవుని పీఠం దగ్గరే పిల్లలను చేసాయి. ఆ పక్షుల్లాగ నిత్యమూ ప్రభుమందిరంలో వసించేవాళ్ళ ఎంతటి ధన్యలో గదా అనుకొన్నాడు ఆ భక్తుడు. పాపల యిండ్లల్లో వేయి దినాలు నివసించిందానికంటె ప్రభుమందిరంలో ఒక్కరోజు గడిపింది మేలుగదా అనుకొన్నాడు.

దప్పికగొనిన దుప్పి సెలయేటి నీళ్ళకుమల్లె భక్తుని హృదయం భగవంతుని కొరకు తహతహలాడుతుంది. ఎప్పడెప్పడు ప్రభు ముఖపద్మాన్ని దర్శిస్తానా అని అతడు ఆతురపడతాడు. ఎండి బీటలువారిన నేల వానకొరకుమల్లె అతని హృదయం కూడ దేవునికొరకు తపించిపోతుంది, కావలివాళ్ళు వేకువజాముకొరకు లాగే అతడూ ప్రభువుకొరకు కనిపెట్టుకొని కూర్చుంటాడు. ఆ ప్రభుని దర్శిస్తేనేగాని, అతని అనుగ్రహాన్ని సంపాదిస్తేనేగాని, అతని కోర్మెలు తీరవు. ఈలా భగవంతుని కొరకు ఉవ్విళ్ళూరే నరుడు ఎంతటి పుణ్యాత్ముడో గదా!

1. నేను కలకాలం ప్రభుమందిరములోనే వసిస్తాను - కీర్త 23,6

2. ప్రభుని ఒక్క వరం కోరుకున్నాను
నాకు కావలసింది ఇదొక్కటే -
నా జీవితకాలమంతా ప్రభు మందిరంలో వసించాలనీ
అతని దయను అనుభవానికి తెచ్చుకోవాలనీ
దేవళంలో అతణ్ణి సలహా అడుగుకోవాలనీ నా కోరిక - 274

3. సైన్యాల కధిపతివైన ప్రభూ!
నీ మందిరం ఎంత సుందరంగా వుంటుంది!
ప్రభు మందిరానికి వెళ్ళాలని నా హృదయం ఆరాటపడుతూంది
నిండుహృదయంతో, పూర్ణానందంతో
నేనా ప్రభుని యెలుగెత్తి పాడతాను - 84, 1-2

4. రాజువూ దేవుడవూ ఐనా ప్రభూ!
నీ మందిరంలో పిచ్చక గూడు కట్టుకొంది