పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. బైబులు బోధలు

1. పూర్వవేదం

1. చావును గూర్చిన నరుల అనుభవాలు

చావును గూర్చి పూర్వవేదం చెప్పే ప్రధాన భావం, మృత్యువు పాప ఫలితం అనేది ఆదాము పాపానికి ముందు చానలేదు. ఆ పాప ఫలితంగా చావ లోకంలోకి వచ్చింది.

ప్రతి నరుడు చావుని స్వయంగా రుచి చూస్తాడు, అది చాల చేదుగా వుంటుంది. ఈ లోక వస్తువులకు అంటిపెట్టుకొని వుండేవాళ్ళకు చావు మరీ చేదుగా వుంటుంది. హిజియా రాజు రాబోయే తన మరణాన్ని తలంచుకొని ఎంతో దిగులుపడ్డాడు - 2 రాజు 20, 2. కాని కష్టాలతో విసిగిపోయినవాళ్ళ యోబులాగ చావుని ఆహ్వానించారు. యోబు 7,15. ఇంకా నరులందరికి చావంటే భయం,అనిష్టం.

పూర్వవేద ప్రజలకు మోక్ష నరకాలను గూర్చి స్పష్టంగా తెలియదు. వాళ్ళ నరుడు చనిపోయాక పాతాళలోకానికి దిగిపోతాడనీ, అక్కడే నిద్రావస్థలో వుండిపోతాడనీ భావించారు. ఈ స్థలాన్ని హీబ్రూ భాషలో షెయోల్ అన్నారు. వాళ్ళ భావాలు ప్రకారం ఈ పాతాళ లోకం పెద్ద గొయ్యి అక్కడ చీకటీ, మౌనమూ రాజ్య మేలుతుంటాయి. అక్కడకు పోయినవాళ్ళను ఎవరూ స్మరించుకోరు. దేవుడుకూడ వారిని పట్టించుకోడు. పాతాళ వాసులుకూడ దేవుణ్ణి స్మరించుకోరు, స్తుతించరు. వారికి ఆనందమేమాత్రం వుండదు. ఒకసారి పాతాళాన్ని చేరుకొన్నవాళ్ళ అక్కడినుండి బయటికి రాలేరు. కనుక చావు నిరాశనూ విషాదాన్నీ కలిగిస్తుంది.

ఎవరి చావునీ చూచి మనం సంతోషించకూడదు. ఒకరోజు మనందరికీ అదే గతి పడుతుంది. నరులు భిన్నరీతుల్లో చనిపోయారు. మోషే నెటో కొండపై అద్భుతంగా మరణించాడు. సౌలు యుద్ధంలో దౌర్భాగ్య మరణానికి గురయ్యాడు. పితరులైన అబ్రాహాము ఈసాకు యాకోబులు పండువంటి నిండు వయసులో ప్రశాంతంగా మరణించారు. ఎవరికి ఏలాంటి చావు సిద్ధిస్తుందో మనకు తెలియదు. ఐనా మృత్యువు మనందరి గమ్యం, అది నిర్దయతో మన ప్రాణాన్ని కబళించి వేస్తుంది. చావుకున్న శక్తితో పోలిస్తే మన జీవం దుర్భలమైంది. నీడలాగ, నీటి బుడగలాగ, నిట్టూర్పులాగపేలవమైంది, క్షణికమైంది. నరులు కొద్దికాలం జీవించి చనిపోయేవాళ్ళయినా మేము శాశ్వతంగా జీవిస్తామో అన్నట్ల విర్రవీగుతుంటారు. ఇది అజ్ఞానం, వ్యర్థ ప్రక్రియ. దేవుడు బ్రతికివున్నవాళ్లందరికీ చావుని