పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐనా మనం తరచుగా ప్రజలకు జ్ఞానోపదేశం బోధిస్తాం. దీనికంటి వాక్యబోధే ముఖ్యo. విశేషంగా పెద్దవాళ్లకు చెప్పేపుడు బైబులునే ఎక్కువగా బోధించాలి.

ఇక మన దేశంలో, మన ప్రాంతంలో, వేదబోధను చేయడాన్ని గూర్చి కొన్ని సంగతులు చూద్దాం.

1. భారతదేశ తిరుసభ తనకొరకు తాను జీవిస్తుంది. తన లాభాన్ని తాను వెదుకుతూంది. స్వప్రయోజనాలను నెరవేర్చుకొంటుంది. తెలివీ పలుకుబడీ కలవాళ్లు చాలమంది తిరుసభను తమ స్వార్ధలాభం కొరకు వాడుకొంటున్నారు. ఈ పద్ధతి పోవాలి. భారత తిరుసభ అన్యుల కొరకు జీవించడం నేర్చుకోవాలి. సేవా మార్గాన్ని అవలంబించాలి. విశేషంగా పేదసాదలను ఆదుకోవాలి. దరిద్రులకు సేవలుచేస్తే ఈ దేశంలో తిరుసభకు మంచిరోజులు వస్తాయి. లేకపోతే లేదు.

2. మనదేశ క్రైస్తవులు ఉత్థాన క్రీస్తునీ అతని శక్తినీ అనుభవానికి తెచ్చుకోవాలి. రోజువారి జీవితంలో, విశేషంగా కష్టాల్లో ఆ ప్రభువుని ఆశ్రయించి అతని నుండి బలాన్ని పొందుతూండాలి. తరచుగా మన విశ్వాసులు దైవానుభూతిలేని ప్రజలుగా జీవిస్తున్నారు. విశేషంగా దైవ వాక్యంలోను దేవద్రవ్యానుమాల్లోనువాళ్లు క్రీస్తు దివ్యశక్తిని గుర్తించాలి.

3. భారతీయ క్రైస్తవులు ఈ దేశ సంస్కృతినీ ఆచార వ్యవహరాలనూ జీర్ణం చేసికోవాలి. మన లౌకిక జీవితంలోను ఆధ్యాత్మిక జీవితంలోను కూడ ఈ దేశ సంస్కృతి ప్రతిబింబిస్తుండాలి. లేకపోతే ఈ దేశంలో క్రైస్తవమతం ఎప్పటికి విదేశమంతంగానే వండిపోతుంది. విశేషంగా మన సంగీతం, దేవాలయ శిల్పం, పండుగలు జరుపుకొనేతీరు, మన గ్రంథాల్లోని భాష చాలవరకు మారాలి.

4. మనకు స్థానిక ఉత్సవాలూ స్థానిక భక్తిమార్గాలూ వున్నాయి. సామాన్య క్రైస్తవుల భక్తిని నిలబెట్టేది ఇవే. కనుక వీటిని జాగ్రత్తగా పదిలపరచుకోవాలి. ఈ వుత్సవాలకూ భక్తిమార్గాలకూ ప్రజలు ప్రోగయినపుడు බීට්පී వాక్యాబోధ చేయాలి.

5. తరచుగా వేదబోధ ఎవరో చేస్తారులే అనుకొంటాం. ఇది పొరపాటు, ప్రతి విచారణా, ఆ విచారణలోని ప్రతి కుటుంబమూ వేదబోధకు పూనుకోవాలి. ఆ మాటకొస్తే ప్రతివ్యక్తి ఇది నాపని అనుకోవాలి. వేదబోధలో వ్యక్తిగతమైన శ్రద్ధ చూపాలి.

6. మఠసభలకు చెందిన గురువులూ సిస్టరూ వేదబోధలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. వీళ్ళకు సభ్యులురటారు. వనరులు వుంటాయి. కనుక వీళ్లు శ్రద్ధతో పనిచేసి ఈ కార్యాన్ని చక్కగా సాధించాలి.