పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. దైవశాస్త్ర రీత్యా గృహస్థల స్థానం

1. భగవంతుడు నూత్న మానవజాతిని సృజించాలని సంకల్పించుకొన్నాడు. ప్రేమ, న్యాయం, సహజీవనం మొదలైనవి ఈ నూతప్రజకు ముఖ్యలక్షణాలు. ఈ నూత్న ప్రజే దైవరాజ్యం, క్రీస్తు వచ్చింది కూడ ఈ దైవరాజ్యాన్ని నెలకొల్పడానికే. లోకంలో ఆయా మతాలకూ సంస్థలకూ చెందిన సజ్జనులు కూడ పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఈ దైవరాజ్య వ్యాప్తికి కృషి చేస్తూనే వుంటారు. కాని వాళ్ళు ఆ రాజ్యాన్ని మరోపేరుతో పిలుస్తారు. ప్రేమ, సమాధానం, స్వేచ్ఛ, న్యాయం, సహజీవనం, నిర్మలత్వం, ఆనందం మొదలైన సదుణాలు ఉన్నకాడల్లా దైవరాజ్యం నెలకొనివుందనే చెప్పాలి. కాని ఈ రాజ్యం లోకాంతంలో గాని పూర్తిగా సిద్ధించదు. ప్రస్తుతం ఈ లోకంలో ఇది పాక్షికంగా మాత్రమే సిద్ధిస్తుంది.

2. తండ్రి క్రీస్తు ద్వారా, ఆత్మశక్తితో, శ్రీసభను నెలకొల్పాడు. దైవరాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించి ఆ రాజ్యాన్ని వ్యాప్తి చేయడం ఈ తిరుసభ బాధ్యత, పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఈ రాజ్యవ్యాప్తికి తోడ్పడే ఇతర వర్గాల వాళ్ళతో గూడ ఈ తిరుసభ సహకరిస్తుంది.

3. శ్రీసభ అంటే యేమో కాదు, దైవప్రజలే. జ్ఞానస్నానం భద్రమైన అభ్యంగం అనే సంస్కారాలను పొంది క్రీస్తు యాజకత్వంలోను, ప్రవక్తృత్వంలోను, రాజత్వంలోను పాలుపంచుకొనిన క్రైస్తవులందరూ ఈ శ్రీసభ సభ్యులే. ఈ సభ్యులందరి బాధ్యతా ఒక్కటే దైవరాజ్యాన్ని వ్యాప్తి చేయడం. ఈ బాధ్యతను అందరూ సమంగానే వహిస్తారు. ఐనా ఈ బాధ్యతను నెరవేర్చడానికి ఆత్మ ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక వరం దయచేస్తుంది. ఒక్కొక్కరిని ఒక్కోరకమైన పరిచర్యకు పరికొల్పుతుంది. కనుక ఒక్కోవర్గంవాళ్లు ఒక్కోరకమైన పనికి పూనుకొంటారు. తిరుసభలో భిన్నవర్గాలవాళ్ళూ భిన్నసేవలూ వున్నాయి. పదిమంది కలసి జీవించే కాడ ఈ వైవిద్యం అవసరం. దేహంలో ఒక్కో అవయవం ఒక్కోరకమైన పని చేస్తుంది కదా! శ్రీసభ సభ్యులందరూ రాజ్యవ్యాప్తి అనే ఏక బాధ్యతను సరిసమానంగా స్వీకరించినా, వాళ్లు కూడ ఓ మానుష సమాజంగా ఏర్పడినవాళ్ళే కనుక, వాళ్లల్లో కూడ నాయకులు అధికారులు మొదలైన వాళ్ళుంటారు. ఐనా ఈ పదవులు పెత్తనం చెలాయించడానికి కాదు, సేవలు చేయడానికి.

పూర్వం తిరుసభలో పాపగారు, కార్డినల్సు, బిషప్పలు, గురువులు, గృహస్థలు అనే శ్రేణులుండేవి. ఈ శ్రేణిలో పై వర్గం వాళ్ళకి విలువ యొక్కువ, క్రింది వర్గం వాళ్ళకి విలువ తక్కువ. తిరుసభ అనే మేడ అంతా పాపగారు అనే ఏకస్తంభం మీద ఆధారపడి