పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిలుస్తుందని భావించేవాళ్ళ కాని రెండవ వాటికన్ సభ తర్వాత ఈ అబిప్రాయం పూర్తిగా మారిపోయింది. తిరుసభలోని సభ్యులంతా దైవప్రజలే. అందరూ దైవరాజ్య వ్యాప్తికి తోడ్పడేవాళ్ళే వాళ్ళల్లో ఒకరు ఎక్కువాలేదు ఒకరు తక్కువాలేదు. అందరికీ ఒకే విలువ. కాని తాము చేసే పనులను బట్టి తిరుసభ సభ్యులు భిన్నశాఖల వాళ్ళవుతారు. బిషప్పల పని వేరు, గురువుల పని వేరు, గృహస్తుల పని వేరు. ఈ విధంగా ఈ సభ్యుల పనుల్లో వ్యత్యాసాలున్నావీళ్ళ విలువలో మాత్రం ఏ వ్యత్యాసమూ లేదు.

4. శ్రీసభలో గృహస్థలు గురువులు అనే శాఖలు పెద్దవి, ముఖ్యమైనవి. ఈ రెండు వర్గాలవాళ్లు పరస్పర విరోధులు కారు. ఏవర్గం చేసే పని ఆ వర్గమే చేస్తుంది. ఇవి రెండు స్వయం ప్రతిపత్తి కల భిన్నవర్గాలు. ఐనా ఈ వృభయ వర్గాలవాళ్లకూడ, తమ ప్రత్యేక పద్ధతిలో, శ్రీసభ వ్యాప్తికే కృషిచేస్తారు. కనుక ఈ రెండు వర్గాలవాళ్లు ఒకరి అంతస్తుని ఒకరు అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. గృహస్థలు దైవరాజ్య వ్యాప్తికి గాను ప్రేషిత సేవ చేయడమనేది గురువుల దయాదాక్షిణ్యాల విూద ఆధారపడి వుండదు. జ్ఞానస్నానం ద్వారానే వాళ్లకు ఆ సేవ చేయడానికి హక్కులభిస్తుంది. క్రీస్తుతండ్రి పంపగా వచ్చిన ప్రేషితుడు. అతనిలోనికి జ్ఞానస్నానం పొందేవాళ్ళంతా అతనిలాగే ప్రేషితులౌతారు.
5. తిరుసభలో ఆధ్యాత్మిక రంగమూ వుంది, భౌతిక రంగమూ వుంది. ఆధ్యాత్మికరంగంలో బిషప్పలూ గురువులూ మొదలైనవాళ్ళ నాయకత్వమూ అధికారమూ వహిస్తారు. ప్రత్యేక సంస్కారాల ద్వారా వీళ్ళకు ఈ హక్కు సిద్ధిస్తుంది. కాని ఈ నాయకత్వమూ అధికారమూ పెత్తనము చేయడానికి గాదు, క్రైస్తవ సమాజానికి పరిచర్యలు చేయడానికి, ఈ యధికారులు క్రైస్తవ సమాజం పేరు విూదిగా పనిచేస్తారు. ఆధ్యాత్మిక రంగంలో గురువుల నాయకత్వం మతపరమైన విశ్వాస విషయాలకూ నైతిక విషయాలకూ మాత్రమే వర్తిస్తుంది. ఈ యాధ్యాత్మిక రంగంలో గృహస్థలు గురువులతో సహకరించి కృషిచేస్తారు. కనుక ఈ రంగంలో వీళ్ళ తోడి పనివాళ్ళు ఔతారు. కాని ఈలా తోడిపనివాళ్లుగా వ్యవహరించడానికి గృహస్థలకు స్వయం ప్రతిపత్తి వుంది. ఈ హక్కువాళ్ళకు జ్ఞానస్నానం ద్వారానే లభిస్తుంది. కనుక ఈ హక్కుని గురువులు భంగపరచకూడదు. తోడిపనివాళ్లుగా గృహస్తులు ఆరాధనలో పాల్గొంటారు. వేదబోధ చేస్తారు. వివిధ సేవాకార్యక్రమాల్లో సహాయులుగా పనిచేస్తారు.
6. భౌతిక రంగంలో గృహస్థలు నాయకత్వం వహించాలి. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, విద్య వైద్యం మొదలైన తిరుసభ సేవా కార్యక్రమాల్లో గృహస్టులే నాయకత్వం వహించడం సబబు. క్రీస్తు ద్వారా ఈ భౌతిక ప్రపంచాన్ని నూత్నపరచడమనేది గృహస్థల