పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తును ద్వేషించినపుడు క్రీస్తు తండ్రిని కూడ ద్వేషించినట్లే అందుకే ప్రభువు అన్యాయపు తోటకాపులు కుమారుని సంహరించి తండ్రి యాస్తిని దోచుకోవాలని చూస్తున్నారని చెప్పాడు - మత్త21,33–39. ఈ సందర్భంలోనే పరిశుద్దాత్మకు విరోధంగా కట్టుకునే పాపాలకు పరిహారం లేదు అనే వాక్యాన్ని గూడ పరిశీలించాలి - మత్త 12 32. ఇక్కడ పరిశుద్ధాత్మ యనగా మరేమోగాదు, దేవుని ప్రేమ. దేవుని ప్రేమను బుద్ధిపూర్వకంగా ధిక్కరించేవాడికి, బుద్ధిపూర్వకంగా దేవుణ్ణి ద్వేషించేవాడికి పరిహారం లేదని భావం. ఎలా వుంటుంది మరి?

46. మీరు మీతండ్రియైన పిశాచానికి సంబంధించినవాళ్లు - యోహా 8, 44

పాపి పిశాచానికి దాసుడు - యోహా 8,84. అతడు దేవుని పుత్రుడు కాడు. పిశాచం పుత్రుడు - పిశాచ పత్రుడు కనుకనే పైశాచిక కార్యాలు చేస్తుంటాడు. ఈ పిశాచం అబద్దాలకోరు, నరహంతకుడు.

అబద్దాలకోరు - 8,44. ఎందుకంటే అబద్దాలు చెప్పి ఆదామే వలను మోసపూచ్చాడు. నరహంతకుడు, ఎందుకంటే ఆదామును మరణం పాలు చేసాడు - జ్ఞాన 2,24. కయీను ద్వారా హేబేలును చంపించాడు -1 యోహా 3, 12-15. యూదుల ద్వారా క్రీస్తును కూడ చంపించబోతూన్నాడు - 8, 39-44.

యూదులు పిశాచ ప్రభావానికిలోనై క్రీస్తును ద్వేషిస్తున్నారు - 15,23. ఈ వాక్యంలో "యూదులు” అనగా పిశాచ ప్రభావానికి లోబడిన పాపపులోకమంతా గూడ.

47. నేను లోకాన్ని జయించాను - యోహా 16,33.

యోహాను భావాల ప్రకారం లోకం పిశాచం అధీనంలో వుంటుంది. క్రీస్తు ఈ లోకాన్ని జయించాడు. ఎలాగంటే, అతని యందు పాపం లేదు - 8,46. అతడు చీకటి యేమాత్రామూ లేని పూర్తి వెలుగు - 8,12. అబద్ద మేమాత్రమూలేని పూర్ణసత్యం - 1,14. కనుకనే అతడు లోకాన్ని జయించగలిగాడు - 16, 33, లోకాన్నేగాదు, లోకపు నాయకుడైన పిశాచాన్ని గూడ ప్రభువు స్వీయమరణం ద్వారా జయించాడు - 12,31.

48. దైవబీజం - 1 యోహా 3,9.

క్రీస్తుని అంగీకరించేవాడు దేవుని బిడ్డ ఔతాడు - యోహా 1,12. అనగా ఆ క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది, అతని ద్వారా, అతని తండ్రికి తానూ దత్తపుత్రుడౌతాడు. ఈలా విశ్వాసి దేవుని పుత్రుడు ఔతాడు గనుక, దేవుని బీజం అతని యందుంటుంది కనుక, పాపం చేయడు - 1 యోహా 3,9. కాని, యేమిటి య దైవబీజం? ఈ బీజం క్రీస్తు వాక్కు లేక బోధ. ఈ బోధను నరుడు స్వీకరించాక, పరిశుద్ధాత్మ అతని హృదయంపై