పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనిచేసి అతన్ని క్రీస్తు వైపు నడిపిస్తుంది. ఈలా మన హృదయంలో నెలకొని వున్న క్రీస్తు వాక్క యీ వాక్కు కనుకూలంగా పవిత్రాత్మ మన యంతరాత్మలో కలిగించే చైతన్యం - ఇది దైవబీజం. దీన్నే యోహాను మరో తావులో 'అభిషేకం" అని కూడ పేర్కొన్నాడు - 1 యోహా 2:27 ಶಿಕ್ಷಣೆ దీన్నే “దేవుని ఆత్మచేత నడిపింపబడ్డం" అంటాడు - రోమ 8,14.

49. దైవబీజం కలవాడు ఇక పాపం చేయడా?

దైవబీజం కలవాడు ఇక పాపం చేయడు అనే యోహాను వాక్యాన్ని పైన చూచాం. కాని, నరుడు క్రీస్తుబోధ ఆలించి అంగీకరించినంత మాత్రాన, పరిశుద్దాత్మహృదయంలో వుండి అతన్ని నడిపించినంత మాత్రాన, ఇకపాపం చేయకుండా వండగలడా? యోహానే “మనం పాపంలేని వాళ్ళమని చెప్పకుంటే మనలను మనమే మోసం చేసికుంటాం" అని వ్రాసాడు -1 యోహా 1,8. మరి "దేవుని బీజం తనయందుంటుంది కనుక నరుడు పాపం చేయడు" అన్నపై వాక్యాన్ని యీ వాక్యంతో సమన్వయపరచడం ఏలాగ? పాపం చేయడు అన్న వాక్యంలో ఆదర్శం చెప్పబడింది. పాపం లేనివాళ్ళమని చెప్పకోగూడదు అన్న వాక్యంలో ఆచరణలో నరుడు చూపే బలహీనత పేర్కొనబడింది. దైవబీజాన్ని హృదయంలో వుంచుకున్న నరుడు పాపం చేయకూడదు. ఇది ఆదర్శం. ఐనా అతడు దైనందిన జీవితాచరణలో బలహీనతవల్ల పాపం చేస్తూనే వుంటాడు. ఇది, నరుడు యీ యాదర్భాన్నిపాటించలేక ఆచరణలో తప్పిపోతూ వుండడం, ఇందుచేతనే పాపం చేయలేదు అనుకొని ఆత్మవంచనం చేసుకోగూడదు.

50. అతడు మన పాపాలకు శాంతి చేస్తాడు - 1 యోహా 2,2౦

మనం పాపం చేయకూడదు. కాని బలహీనతవల్ల చేసామో, యేసుక్రీస్తు మన పాపాలకు శాంతి చేస్తాడు. మన పాపాలను ఆ ప్రభువు జాలితో పరిహరిస్తాడు. ఈలా పరిహరించడం కోసమే ప్రభువు శిష్యులకు తన ఆత్మను అనుగ్రహించాడు - యోహా 20, 22.

ఫలితార్థ మేమిటంటే, దైవబీజం మనలోవుంది కనుక అనగా మనం వినిన క్రీస్తబోధ ప్రభావంవల్లనైతేనేం, మన హృదయంలోని పరిశుద్దాత్మ ప్రభావంవల్లనైతేనేం మనం పాపం చేయడం మానుకోవాలి. ఒకవేళ యీ బోధను, యీ యాత్మ ప్రబోధాన్ని గాదని బలహీనతవల్ల పాపం చేసామో పశ్చాత్తాపపడి ప్రభువు ద్వారా పరిహారం పొందాలి. పరిశుద్దాత్మ ద్వారా ప్రభువు మన పాపాలను పరిహరిస్తాడు.