పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90. ప్రూస్వకాలికమైన నరజీవితం

ఈ గీతం చెప్పిన కవి భగవంతుని శాశ్వత జీవితాన్ని నరుని అల్పాయుస్సుతో పోల్చాడు. ఆ అల్పాయుస్సును తలంచుకొని బాధపడ్డాడు. ప్రభువు నిత్యుడు. అనాదికాలం నుండి ఎల్లకాలం వరకు ఉండేవాడు. అతనితో పోలిస్తే నరజీవితం ఏపాటిది? దేవుడు నరులతో మీరు మన్నయి పాండని పల్కుతాడు. నరజీవితం డెబ్భయి లేక ఎనుభైయేండ్లు మాత్రమే. ఈ కొద్దిపాటి జీవితంగూడ బాధావిచారాలతో నిండివుంటుంది. క్షణ కాలంలో ముగుస్తుంది. నరులు తమ ఆయుష్మాలం ఎంత స్వల్పమైందో గ్రహిస్తే విజ్ఞలౌతారు. కాలాన్ని వ్యర్థం చేసికోగూడదు. దేవుడు మనకు దయచేసిన ప్రస్వజీవితాన్ని సద్వినియోగం చేసివాకొని ఈ లోకంలో వుండగానే పరలోకాన్ని సంపాదించుకోవాలి. లేకపోతే మోసపోతాం. మన కాలాన్ని మనం ఏలా వాడుకొంటున్నాం?

91. దేవుని రక్షణం

ఇది విజ్ఞాన కీర్తనం. ప్రభువు తన్ను నమ్మిన భక్తుణ్ణి తప్పక కాపాడతాడు. దేవుడు అతనికి రక్షణ దుర్గమౌతాడు. భక్తుణ్ణి తన రెక్కల మాటున వుంచి కాపాడుతాడు. అతనికి డాలుగాను రక్షణాయుధంగాను వుంటాడు. తన దేవదూతలద్వారా అతనికి రక్షణం కల్పిస్తాడు. సకాలాపదలనుండి అతన్ని కాపాడతాడు. అన్ని విధాల అతనికి రక్షణాన్ని దయచేస్తాడు. భక్తుడు మాత్రం ప్రభువునినమ్మి జీవించాలి. రాత్రి పండుకోకముందు ఈ కీర్తనను చదువుకొంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అన్ని రక్షణలకంటె దైవరక్షణం గొప్పదికదా

92. పుణ్య పురుషుని ఆనందం

ఈ కీర్తన కృతజ్ఞతాస్తుతి. వారాంతంలో విశ్రాంతి దినాన జపించేది. దీనిలో కీర్తనకారుడు ప్రభువు తనకు చేసిన ఉపకారాలకు అతనికి వందనాలు చెప్పాడు. మూర్థులకు ప్రభువు మేలి కార్యాలు తెలవ్వు వాళ్లు దేవునికి వందనాలు అర్పించరు. కనుక వాళ్లు తరపున గూడ భక్తుడే దేవునికి వందనాలు చెప్పాడు. భగవంతుని కరుణకార్యాలను గూర్చి ఆలోచించుకోగా భక్తనికి తట్టిన భావం ఇది. దుష్టులు నాశమైపోతారు. సత్పురుషులు మాత్రం ఖరూర వృక్షంలా వృద్ధిచెందుతారు. భగవంతుడు మనకు కూడ ఎన్నో వుపకారాలు చేసాడు. వాటికి మనం ప్రభువుకి నిరంతరం వందనాలు అర్పించాలి. మనకున్నవన్నీ దేవుడు ఇచ్చినవేకదా!

93. దేవుని ప్రాభవం.

ఇది ప్రభువు రాజత్వాన్ని కీర్తించే పాట, దేవుడు మహారాజు, మహాబలవంతుడు. అతడు సృష్టిని చేసాడు. ఆ సృష్టికి రాజై ఒప్పతున్నాడు. అతని ఆజ్ఞలకు తిరుగులేదు.