పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎల్లప్రాణులు అతని శాసనాలను పాటించవలసిందే. ప్రభు మందిరంలో భక్తులు అతన్ని రాజాధిరాజునిగా, దేవాధిదేవునిగా గుర్తించి ఆరాధిస్తారు. ఆ మందిరం పరమ పవిత్రమైంది. నూత్నవేదంలో క్రీస్తు మనకు రాజు, ఆ రాజాధిరాజుని మనం పరమ భక్తి భావంతో ఆరాధించాలి.

94. దేవుడు న్యాయాధిపతి

ఈ కీర్తనకారుడు ప్రభుని న్యాయాధిపతినిగా వర్ణించాడు. అతడు లోకంలోని పాపాన్నీ దుష్టత్వాన్నీ చూచి వ్యాకులం చెందాడు. నరులు దేవుడు లేడో అన్నట్లుగా పాపాలు చేస్తున్నారు. కాని ప్రభువు వారి దోషాలన్నిటినీ గమనిస్తాడు. ఎవడు దైవశిక్షను తప్పించుకోలేడు. ఇతరుల పాపకార్యాలను చూచి వ్యాకులంచెందే భక్తులకు దేవుడే చిత్తశాంతిని దయచేస్తాడు. ఇతరులు దుష్కార్యాలు చేస్తున్నామనతరపున మనం ప్రభువుని నమ్మి సత్కార్యాలే చేయాలి. ఒక రోజు వచ్చినపుడు ఎల్లరికి తీర్పు తీర్చే న్యాయాధిపతి ఉండనే వున్నాడు.

95. దైనందిన ప్రార్ధనం

కొందరు భక్తులు దేవళానికివచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆ ప్రభువు సృష్టికర్త, యిప్రాయేలు జాతిని ఎన్నుకొన్నవాడూను. కనుక రండి, శిరంవంచి మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లదాం అని వాకొన్నారు. అతడు మనకు దేవుడు, మనం అతడు కాచికాపాడే ప్రజలం అని చెప్పకొన్నారు. అంతలో ఓ ప్రవక్త వచ్చి మీరు కూడ పితరుల్లాగ అవిధేయులు కావద్దని హెచ్చరించాడు. ప్రభువు పితరుల అవిధేయతను చూచి వారిని వాగ్డత్త భూమిలో అడుగుపెట్టనీయలేదు. మనం కూడ వారిలా కాగూడని మందలించాడు. ఇప్పడు ఈ కీర్తన తిరుసభ ప్రార్థనలో మొదట వస్తుంది. పితరులవలె మీరుకూడ హృదయాలను కఠినం చేసికోవద్దని హెచ్చరిస్తుంది. భగవంతుడు మననుండి కోరేది విధేయత, దైవచిత్తాన్ని పాటించడం.

96. రాజూ న్యాయాధిపతీ ఐన ప్రభువు

దేవుడు రాజు, న్యాయాధిపతీ. అతని రక్షణ కార్యాలకు క్రొత్త పాటతో అతన్ని స్తుతించాలి. అన్యజాతులు కూడ అతన్నికీర్తించాలి. దేవుడు తన భక్తులను సందర్శించడానికి విచ్చేస్తున్నాడు. కనుక ప్రకృతి శక్తులన్నీ సంతోషంతో అతన్నిస్తుతించాలి. పరమాత్ముడు కంటికి కన్పించకపోయినా ప్రకృతిలో మనకు దర్శనమిస్తాడు. అతన్ని ఎల్లపడు వందించాలి.