పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విను, నా వేడికోలును ఆలించు అని మనవి చేసాడు. నేను నీ మందిరాన వసిస్తాను, నీ రెక్కల మరుగున తలదాచుకొంటాను అని భక్తితో చెప్పకొన్నాడు. యిప్రాయేలు ప్రజలకు రాజంటే గౌరవం. కనుక అతని కొరకు విజ్ఞాపనం చేసాడు. ప్రభువు మనం ఎక్కలేని ఉన్నత పర్వతాన్ని ఎక్కిస్తాడు. అతని కరుణే మనకు రక్ష మనకు కూడ దేవాలయ భక్తిని దయచేయమని ఆ లోకనాథుని అడుగుకొందాం.


62. భగవంతునిపై కోర్కె


ఇది భగవంతునిపట్ల మొక్కవోని నమ్మకాన్ని చూపే కీర్తన. దేవుడు మాత్రమే నాకు విశ్రాంతిని దయచేస్తాడని భక్తుడు నమ్మకంతో చెప్పకొన్నాడు. నేను ప్రభువుని మాత్రమే నమ్ముతాను అని దృఢవిశ్వాసంతో వాకొన్నాడు, బలమూ ప్రేమా ప్రభువుకే చెందుతాయి అన్నాడు. జనులారా మీరు ఎల్లవేళల ప్రభువుని నమ్మండి, మీగోళ్లు అతనికి విన్నవించుకోండి అని తోడివారిని హెచ్చరించాడు. దేవునిపట్ల ఈ భక్తునికి వున్న నమ్మకం మనకు కూడ వుంటే ఎంత బాగుంటుంది!


63. దేవునిమీద కోర్కె


ఇది భగవంతునిమీద కోరికా ప్రేమా తెలిపే పాట. భక్తుడు దేవా నేను నీకొరకు ఉబలాటం చెందుతున్నాను అన్నాడు. నీళ్లలేక మాడివున్న నేలలాగ నా ప్రాణం నీ కొరకు దప్పికగొంటూంది అని పల్మాడు. నీ ప్రేమ దీర్గాయువు కంటెగూడ మెరుగైంది అన్నాడు. ఈ భక్తుడు భగవత్సాన్నిధ్యాన్ని అనుభవించినవాడు. దానికెంతో విలువనిచ్చినవాడు. కనుకనే నీ సాన్నిధ్యమనే విందును ఆరగించి నా యాత్మ సంతృప్తిని చెందుతుంది అని చెప్పకొన్నాడు. పగలేగాక రాత్రికూడ ప్రభువుని ధ్యానించుకొని పులకించిపోయాడు. నా పడక మీద నిన్ను స్మరించుకొంటాను. రేయి నాలుజాములు నిన్ను ధ్యానించుకొంటాను అని అనుభవపూర్వకంగా చెప్పకొన్నాడు. ఈ ଓଁcଷ୍ଣୁ పురుషునిలాగా మనంకూడ దేవా! నేను నీకు అంటిపెట్టుకొని నడుస్తాను అని చెప్పకొందాం. దైవభక్తి కొరకు ప్రార్థిద్దాం.


64. నిందలు మోపినవారికి శిక్ష


శత్రువులు పరుషవాక్కులతో కీర్తనకారుని నొప్పించారు. అతనిపై అపదూరులు మోపారు. ఆ సందర్భంలో చెప్పిన విలాప కీర్తన యిది. విరోధులు తమ దుష్టవాక్కులను కత్తులవలె, బాణాలవలె కీర్తనకారుని మీదికి విసిరారు. అతనికి ఎంతో బాధ కలిగింది. కాని శత్రువులు తనమీద బాణాలు రువ్వితే, దేవుడు ఆ శత్రువుల మీద బాణాలు రువ్వతాడు అనుకొని అతడు సంతృప్తి చెందాడు. రోజువారి జీవితంలో నాలుకతో ఇతరులు మనలను