పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాధిస్తారు. మనమూ ఇతరులను బాధిస్తాం. కనుక మన నాలుకనూ దాని నుండి వెలువడే పరుషవాక్కులనూ అదుపులో పెట్టుకొనే భాగ్యంకొరకు ప్రభుని వేడుకొందాం.


65. వందన సమర్పణం


ఇది ప్రభువు వానలు కురిపించి పంటలు సమృద్ధిగా పండించినందులకు కృతాజ్ఞతాస్తుతి. ఈశ్వరుడు కుండపోతగా వాన కురిపించి పొలాన్ని తడుపుతాడు. వానవలన పైరెదిగివచ్చి పంటలు బాగా పండుతాయి. ప్రభువు తన మంచితనం వల్ల సంవత్సరాన్ని పంట అనే కిరీటంతో అలంకరిస్తాడు, అనగా విస్తారమైన పంటను దయచేస్తాడు. అతడు నడచే తావులన్నిటా ధాన్యసమృద్ధి నెలకొంటుంది. పంట సర్వేశ్వరుడు పెట్టే భిక్ష కదా! పచ్చిక పట్టుల్లో గొర్రెల మందలు, లోయల్లో గోదుమపైరు కన్నుల పండువుగా కన్పిస్తుంటాయి. మన దేశంలో ఎప్పడూ అనావృష్టి బాధ. అప్పుడప్పడూ అతివృష్టి బాధకూడ కనుక సకాల వరాలతో అనువైన పంటలతో మనదేశాన్ని దీవించమని ప్రభువుని వేడుకొందాం. అతడు దయచేసిన ధాన్యలక్ష్మికి వందనాలు అర్చిద్దాం.


66. ప్రభుని స్తుతించండి


ఇది కృతజ్ఞతా కీర్తన, ప్రభువు జరిగిపోయిన కాలంలో యిస్రాయేలీయులకు మేలు చేసాడు. వారిని సముద్రం గుండా నడిపించుకొనిపోయాడు. యోర్గాను నదిని దాటించి కనాను దేశాన్ని చేర్చాడు. శత్రువులు యిస్రాయేలీయులను నానా శ్రమలకు గురిచేస్తే ప్రభువు ఆ బాధలన్నిటి నుండి వారిని కాపాడాడు. ఈ వుపకారాలన్నిటికి భక్తుడు. ప్రభువుకి వందనాలు చెప్పాడు, ఇంకా దేవుడు కీర్తనకారునికి వ్యక్తిగతంగా ఉపకారాలు చేసాడు. కనుకనే అతడు కృతజ్ఞతాభావంతో "ప్రభువు నాకు చేసిన మేలును మీ కందరికి విన్పిస్తాను" అన్నాడు. భగవంతుడు మనకు కూడ ఎన్నో మేళ్లు చేసాడు. ఎన్నో ఆపదల నుండి మనలను కాపాడాడు. దీనికి మనం అతనికి ఎల్లవేళల కృతజ్ఞత


67. కోతకాలపు పాట


ఇది రైతులు పంటను కోసికొనేపడు పాడే పాట. యవలు, గోదుమలు, ద్రాక్షలు, ఓలివులు యిప్రాయేలీయుల ಮಿಟ್ಟ ಏಂಬಲು. దేవుడు వానలు కురిపించి ప్రజలను దీవించాడు. వాళ్ళ పొలం చక్కగా పండింది. ఇందుకు వాళ్లు దేవుణ్ణి స్తుతించారు. అన్యజాతులు కూడ అతన్నిస్తుతించాలని కోరుకొన్నారు. నేడు మన పొలాలను పండించేది కూడ ఆ సర్వేశ్వరుడే. మనకు కూడు గుడ్డ యిల్ల వాకిలి దయచేసేది అతడే. కనుక