పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవించినట్లే శిష్యులు కూడ దేవుని విూద ఆధారపడి జీవించాలని బోధించాడు- మార్కు 10, 13-16.

ఇది బైబులు సంస్కృతి. ఈ దృక్పథంతోనే క్రైస్తవ తల్లిదండ్రులు కూడ బిడ్డలను గాఢంగా వాంఛించాలి. దేవుడు తమకు ప్రసాదించిన బిడ్డలను ఆదరంతో అంగీకరించాలి. వాళ్లను ఎంతో విలువతో చూచుకొని ఆప్యాయంగా పెంచిపెద్దచేయాలి.

2. సంతానం దైవవరం

ఆదాము ఏవను కూడాడు. ఆమె గర్భవతియై బిడ్డను కని "దేవుని తోడ్పాటుతో నేను మగబిడ్డను ప్రసవించాను" అని అనుకొంది - ఆది 4,1. ఆ బిడ్డ ఆమెకు భర్త వలనా పుట్టాడు, దైవానుగ్రహం వలనా పుట్టాడు. నరుల్లో ప్రధానమైంది ప్రాణం. అదే ఆత్మ దేవుడే ఈ ప్రాణాన్ని నరుల్లో ప్రవేశ పెడుతూంటాడు - ఆది 6,3. భార్యాభర్తలు కలుసుకొన్నాక భార్య గర్భంలో ఏర్పడే పిండంలోకి ప్రభువు తన ప్రాణాన్ని ప్రవేశపెడతాడు. తర్వాత ఆపిండమే మనుష్య శిశువుగా జన్మిస్తుంది. ఈ విధంగా ప్రభువు తల్లిదండ్రుల ద్వారా బిడ్డలను కలిగిస్తుంటాడు. భూమి మిూద మనుష్య ప్రాణులను కొనసాగిస్తూంటాడు. దేవుడు తల్లిదండ్రులకిచ్చే వరం బిడ్డలు.

బైబుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలు లేక బాధపడిపోతారు. ప్రభువు వాళ్ళ వేడికోలు ఆలకించి ఓ పుత్రుణ్ణి ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ ప్రమాణం ప్రకారం తర్వాత బిడ్డడు పుడతాడు. తల్లిదండ్రులు కూడ అలా పట్టిన బిడ్డట్టి దేవుని వరంగా భావిస్తారు. దేవుని వాగ్దానం ప్రకారం అబ్రాహాము సారాలకు ఈసాకు పుట్టాడు - ఆది 17,15-21. మనోవా దంపతులకు సంసోను జన్మించాడు - న్యాయాధి 13,2 5, ఎల్మానా అన్నాలకు సమూవేలు ఉద్భవించాడు– 1సమూ 19-20. ఈ యిూసాకు సంసోను, సమూవేలు లాంటి అసంఖ్యాక శిశువులందరు తల్లిదండ్రులకు భగవంతుడు అనుగ్రహించిన వరాలే.

139వ కీర్తన వ్రాసిన భక్తుడు తాను శిశువుగా తల్లి గర్భంలో దాగివున్నకాలాన్ని తలంచుకొని విస్తుపోయాడు :

"నా యెముకలన్నీ నేర్పుతో అమర్చి
మాతృగర్భంలో నన్ను పొందుపరచింది నీవే
నన్నెంత విచిత్రంగా, భయంకరంగా, సృజించావు
నీ లీల లెంత ఆశ్చర్యకరమైనవి :
కావున ప్రభో! నీనే నిన్ను సన్నుతిస్తాను"

అని వాకొన్నాడు – 139, 13-14. తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ప్రేమ, గౌరవం ఆశ్చర్యభావం కలగాలి. వాళ్ళను దేవుని వరాలుగా భావించాలి.