పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువిశేషంలో ఓ కథ విన్పిస్తుంది. యాయిూరుకొమార్తె చనిపోయింది. ఆ బాలికకు పండ్రెండేండ్లు, తల్లిదండ్రులు ఆ బిడ్డను తలంచుకొని శోకిస్తున్నారు. ప్రభువు ఆ బాలిక చేయిపట్టి పైకి లేవమనగా ఆ బిడ్డ మరల జీవంతో లేచింది - మార్కు 5, 41-42 ప్రభువు అనుగ్రహం వల్లనే ఆ బిడ్డ మరల మేల్కొంది. పైకి లేచింది, అడుగులు వేసింది, అన్నం తింది. అలా బ్రతికిన కొమార్తెను చూచి యాయిూరు అతని భార్య ఎంతో సంతోషించి వండాలి. క్రైస్తవ దంపతులు ప్రేమతో ఒకరినొకరు కలసికొన్నపుడు, అనురాగ భావంతో వాళ్ళ శరీరాలు ఐక్యమైనపుడు, ఆ ప్రేమను దీవించేది ప్రభువే. అలా దీవించి దాంపత్య ప్రేమను సంతానంగా మార్చేది కూడ ఆయనే క్రీస్తు స్వర్గంలోను, శ్రీసభలోను, దివ్య సత్ర్పసాద మందసంలోను మాత్రమే వుండేవాడు కాదు, Sšš కుటుంబంలో కూడ నెలకొని వుండేవాడు. దంపతుల ప్రేమను తన ప్రేమతో మిళితం చేసి వాళ్ళకు బిడ్డలను ప్రసాదించేవాడు. ఎందుకంటే వాళ్ళ క్రీస్తు నందు వివాహం చేసికొన్న సతీపతులు. కనుక క్రైస్తవ దంపతులు ఆ తొలితల్లి ఏవలాగే దేవుడు తమ కిచ్చిన బిడ్డల కొరకు అతనికి కృతజ్ఞత తెలియజేయాలి.

3. పిల్లలను నడిపింపవలసిన తీరు

అబ్రాహాము స్వదేశమైన పదనారామును వీడి కనాను మండలానికి వచ్చాడు. అచ్చట అతనికి ఈసాకు జన్మించాడు. అతడు తన కుమారునికి కనానీయుల పిల్లను పెండ్లి చేయదలచుకోలేదు. కనానీయులు కొలిచే దేవుడు వేరు. వాళ్ళ పిల్లను పెండ్లి చేసికొంటే ఈసాకు తన తండ్రి దేవుడైన యావే ప్రభువుని పూజింపలేడు. కనుక తన కుటుంబం నుండే ఈసాకునకు వధువును తీసికొని రావటానికై అబ్రాహాము సేవకుని పదనారాముకు పంపాడు. ఆ సేవకుడు త్రోవ వెదక్కుంటూ దైవవశాత్తు రిబ్కాయింటికే వెళ్లాడు. రిబ్కా ఈసాకుని పెండ్లియాడ్డానికి ఇష్టపూర్తిగా సమ్మతించింది. తల్లిదండ్రులు కూడా ఆమెకు అడ్డు చెప్పలేదు. తర్వాత సేవకుడు రిబ్మాను కానాను మండలానికి తీసికొని రాగా ఈసాకు ఆమెను పెండ్లి యాడాడు - ఆది 24. ఈవిధంగా తల్లిదండ్రులు పిల్లలను మంచిమార్గంలో నడిపిస్తుండాలి. పిల్లల స్వేచ్ఛకు అడ్డుపడకుండా వాళ్ళకు హితోపదేశం చేస్తుండాలి. వాళ్ళను ఓ యింటివాళ్ళను చేయాలి.

4.కుటుంబ థర్మాలు

1. దైవ కుటుంబం యిస్రాయేలు ప్రజలకు కుటుంబ జీవితం పరమ పవిత్రమైనది. కుటుంబమంతా కలసి ప్రభువుని ఆరాధించుకొనేది. కుటుంబంలోని పెద్దలు పిల్లలకు తమ పూర్వ