పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54, 5-6. అనగా ప్రభువు పాపంచేసిన ప్రజను భర్త దుష్టభార్యను వలె విసర్జించాడు. మళ్లా ఆ ప్రజను తలంచుకొని జాలిపడి భర్త భార్యనువలె చేరబిలచాడు. ಬುಲು భగవంతుడు తన ప్రజలను ఈలా ప్రేమిస్తాడు.

28. నీవు నన్ను స్వస్టుణ్ణి చేసినటైతే - యిర్మీ 17,14

నరుడు పాపాన్నుండి బయటపడ్డం కోసం, మళ్ళా తన చెంతకు తిరిగిరావడంకోసం, భగవంతుడు సహాయపడతాడు. ప్రభువు తన పాపపు వధువును ఆకర్షించి అరణ్యంలోనికి తీసికొనిపోయి అక్కడ ఆమెతో ప్రేమతో మాటలాడతాడు - హోషే 2, 14 అనగా ప్రభువు పాపపు ప్రజలను అనుగ్రహించి వారిని తన యొద్దకు రాబట్టుకుంటాడని భావం, యావే అనుగ్రహించందే రక్షణ లేదు అంటాడు కీర్తన కారుడు - 48. యిర్మీయా ప్రవక్తకూడా "ప్రభూ, నన్ను స్వస్టడ్డి చేసినట్లయితే నేను స్వస్టణితాను. నవు నన్ను రక్షించినట్లయితే నేను రక్షణ పొందుతాను" అని ప్రార్ధిస్తాడు - 18, 14 ఈలా భగవంతుని సహాయంపొంది మల్లా అతని దగ్గరకు తిరిగిపోయే నరుడు ధన్యుడు.

29. వాళ్ళ పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసికోడు - యిర్మీ 31.34

నరుని పరివర్తనమనేది భగవంతు డనుగ్రహించే ఓ కృపావరం. ఈ సత్యాన్ని గమనించాడు గనుకనే ప్రవక్త విలాపవాక్యగ్రంథంలో "ప్రభూ, నీవు మమ్మ నీ తట్టునకు త్రిప్పకుంటే మేము నీవైపు తిరుగుతాం” అని ప్రార్థించాడు - 5,21. యెహెజ్కేలు ప్రవచనంలో ప్రభువు "పాపాత్ముడు మరణించడం వలనగాదు, మనసు మార్చుకొని బ్రతకడం వలన నాకు సంతోషం కలుగుతుంది” అని అంటాడు. 33, 11. ఈ వాక్యం పూర్వవేదమనే గనిలోని అమూల్య రత్నమనాలి! యిర్మీయా ప్రవచనం ప్రకారం ప్రభువు తన ప్రజలతో క్రొత్త నిబంధనం చేసికుంటాడు. ఈమారు రాతి పలకలమీద కాక, వాళ్ళ హృదయాలమీదనే ధర్మవిధులను వ్రాస్తాడు. అతడు వాళ్ళ దోషాలను క్షమిస్తాడు. వాళ్ళ పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసికోడు - 31, 31-34. ఈ ప్రవచనం నూతవేదపు క్రీస్తు సిలువ బలిద్వారా సిద్ధినందుతుంది. ఈలా ప్రభువు పాపియైన నరుణ్ణి ఆదరించి స్వీకరిస్తాడు. అందుకే ప్రవక్త యెషయాగూడ "ప్రభూ, నీవే మాకు తండ్రివి. అబ్రాహాము మమ్మెరుగకపోయినా యిప్రాయేలు మమ్మంగీకరించకపోయినా, నీవమాత్రం మా తండ్రివే. అనాదికాలం నుండి మా విమోచకుడవని నీకే పేరు గదా" అని ప్రార్ధిస్తాడు - 68, 16. నిజాయితీకీ, భక్తిభావానికీ భక్తుడు ఈ ప్రార్థనను నమూనాగా దీసికోవాలి!

30. నాయందు నిర్మలహృదయాన్ని సృజించు - కీర్త 51.10

పాపం దేవునికి, వ్యతిరేకంగా పోతుంది. దేవుని కృపమాత్రమే ఈ పాపాన్ని క్షమించగలదు. కాని మొదట నరుని హృదయంలో మార్చనేది కలిగితేనేగాని భగవంతుడు