పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. మఠంలో చాలా అంశాలుంటాయి. అర్యశిషులపట్ల భక్రీ, నియమాలను పాటించడమూ, మౌనమూ, నియమిత జపాలూ, నేత్రవినీతీ మొదలైన అంశాలు ఎన్నెనా వుంటాయి. క్రీస్తుపట్ల ప్రేమాభక్తి చూపడంగూడ ఈ నానావిషయాల్లో ఒకటి అనుకోగూడదు. క్రీస్త భక్తి ప్రధానవిషయం. వేరేవన్నీ దీనికోసం. కనుక ఇదిలేందే అవన్నీవ్యర్థం. బండిచక్రంలోని ఆకులన్నీ మధ్యనున్నకుండలోనికి కేంద్రీకృతమైనట్లే మన కోరీకలూ పనులూ భక్తిక్రియలూ అన్నీకూడ క్రీస్తుమీదికి కేంద్రీకృతంకావాలి. ఇది క్రీస్తకేంద్రీకృత జీవితం. కొంతమంది మఠవాసినులు ముసలి వాళ్లినంకగూడ ఈ సత్యాన్ని గమనింపరు. ప్రభువు "మార్తా! నీవు చాలా పనులతో సతమతమై పోతూన్నావు. కాని అవసరమైనదొక్కటే" అన్నాడు - లూకా 10,41. తండ్రిమీదా, అతడు పంపిన క్రీస్తుమీదా హృదయం నిల్పడమే అవసరమైన పని.

3. మనం మఠంలో చేరేది కొన్ని నియమాల ప్రకారం జీవించేందుకుగాదు. మరి సజీవుడైన ఓ వ్యక్తిని అనుసరించేందుకు. కాంగ్రెసు, కమ్యూనిస్తు వంటి రాజకీయపక్షాలు కొన్ని సిద్ధాంతాల ప్రకారం నడుస్తూంటాయి. కాని మరజీవితమంటే ఓ సిద్దాంతం ప్రకారం జీవించడంగాదు. ఓ వ్యక్తిని అనుసరించడం. ఈ వ్యక్తి దేవుడు, ఐనాగాని మానవుడు. మృతుడు, ఐనాగాని ఉత్తానమై సజీవుడై యున్నవాడు. క్రైస్తవ సమాజంలోని విశ్వాసుల్లోను మఠకన్యల్లోను గురువుల్లోను నెలకొనివుండే ప్రభువు. ఈ ప్రభువకై మన హృదయాన్ని అర్పించుకోవాలి. బిడ్డ తల్లిచేతుల్లోనికిలాగ అతని చేతుల్లోనికి మనలను మనం అర్పించుకోవాలి. మహాభక్తులు ఈలా ఆత్మార్పణం చేసికొన్నారు. ఇప్పడు నేనుగాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు అన్నాడు పౌలు - గల 2, 20. ఆ ప్రభువు ఓరాజు, నేను అతని సేవకుణ్ణి అన్నాడు ఇగ్నేప్యము. ఆ ప్రభువు ఓ తండ్రిలాంటివాడు, అతనిచేతుల్లోకి ఓ పసిబిడ్డనులాగ నున్న నేను అర్పించుకొంటున్నాను అంది చిన్న తెరేస.

4. మామూలుగా మనం నోవిప్యేటులో వున్నదానికంటె తరువాత ఎక్కువ భక్తిమంతురాళ్లం కాలేము. ఉదయాన్నిబట్టి ఆరోజు ఏలావుంటుందో నిర్ణయించవచ్చు. చిన్నపిల్లవాడ్డి జూచి వాడు పెద్దవాడయ్యాక ఏలాంటి వాడౌతాడో తెలిసికోవచ్చు. ఆలాగే నోవిసునుజూచే ఆమె భావి కన్యాజీవితం ఎలావుంటుందో ఊహించవచ్చు. కనుక నోవిష్యేటులో వున్నపుడే క్రీస్తుని అర్థం చేసికోవాలి. ఆ ప్రభువుపట్ల భక్తి అలవర్చుకోవాలి. నోవిసుకు వేరేపనంటూ లేదు.

5. నోవిప్యేటుల్లోను సెమినరీల్లోను తర్ఫీదుపొందే యువతీయువకులు బాధ్యతాయుతంగా మెలగడం నేర్చుకోవాలి. బడిపిల్లల్లాగ చిలిపిచేష్టలతో కాలం గడపగూడదు. వాళ్లు రేపటి అమ్మగారూ గురువులూను. కనుక వాళ్లు ఈ తర్ఫీదుకాలంలో పెద్దలు మనలను గమనిస్తున్నారు, పై యధికారులును మెప్పిద్దాం_అన్నట్లుగా