పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు అపారంగా బలులర్పించినవాడి
పాపాలు పరిహరించడు
పేదల నోళ్లుగొట్టి ఆ సొమ్ముతో బలి అర్పిస్తే
తండ్రియెదుటనే అతని కుమారుడ్డి చంపినట్ల
దరిద్రుడి అన్నం పేదకూడు
వాడి నోటికాదికూడ పడగొట్టేవాడు నరహంత
పేదవాడి బత్తెం చెడగొడితే వాణ్ణి చంపినట్లే
కూలి ఎగవేస్తే వాడి నెత్తురు చిందించినట్లే " - 34, 18–22
ధనవంతులు పేదలసామ్మ దోచుకొని ఆ ನಿಮ್ಮಿತ್ దేవునికి బలులర్పిస్తున్నారు.
ఈలాంటి ఆరాధనను దేవుడు అంగీకరించడు అని సీరా భావం.

2) పేదవాడి మొర


బక్కవాణ్ణి దోచితెచ్చిన ನಿಮ್ಮಿತ್ గుడిలో బలులర్పిస్తే, ఆ బలిగుండానే పేదవాడి మొరకూడ దేవుని సన్నిధిలోకి వెళ్తుంది. కనుక ప్రభువు ఆ మొర ఆలించితీరతాడు. సీరా ఈaలా పలికాడు:
"ఒకడు ప్రార్ధిస్తుంటే మరొకడు శపిస్తుంటే
దేవుడు ఆ యిద్దరిలో ఎవరి మొర ఆలిస్తాడు?
నరుడు శవాన్నితాకి స్నానంచేసి
మళ్ళా శవాన్ని ముట్టుకొంటే లాభమేమిటి?
జనుడు పాపాలుచేసి ప్రాయశ్చిత్తంగా వుపవాసముండి
మళ్ళా అదే పాపాలు చేస్తే
వాని ప్రార్థనలు ఎవరు ఆలిస్తారు?
ఆ వుపవాసంవలన ఫలితమేమిటి?" - 34: 24-26.
"ప్రభువు పేదలకు అన్యాయం జరగనీయడు
అతడు పీడితునిమొర ఆలించితీరతాడు
అనాధుల గోడు వినితీరతాడు
వితంతువు ఆపసోపాలు ఆలించితీరతాడు' - 35, 13-15

 

3) కపటభక్తుల ఉపవాసాలు ఫలించవు



కపటభక్తులు ఓ వైపు పేదలను పీడిసూ మరోవైపు దేవుణ్ణి కొలుసూ ఉపవాసముంటారు. కాని దీనులను వంచించారు గనుక ప్రభువు వాళ్ళ ఉపవాసాన్ని అంగీకరించడు. యెషయా ఈలా చెప్పాడు :