పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"మీరు ఉపవాసాలు చేస్తూనే పేదలను పీడిస్తున్నారు
ఉపవాసాలు చేస్తూనే దీనులతో పోట్లాడి
వాళ్ళను చేతో మోదుతున్నారు
ఈ లాంటి వుపవాసాలు సాగిస్తే
మీ మొర దేవుని చెవిలో పడుతుందా?" - 58, 4-5
ఫలితాంశమేమిటంటే, హృదయశుద్ధి లేని కర్మకాండలు దేవునికి ప్రియపడవు. సాంఘిక న్యాయాన్ని సోదర ప్రేమనూ పాటించకుండా వట్టి బలులూ నైవేద్యాలూ అర్పిస్తే దేవుడు చీదరించుకొంటాడు. ఈలా మూడు కారణాలను మనసులో పెట్టుకొని ప్రవక్తలు ఆ నాటి ఆరాధనను తెగడారు.

3. చిత్తశుద్ధిగల ఆరాధనం



ప్రవక్తలు డాంబికమైన ఆరాధనను ఖండించారు అన్నాం. వాళ్లు చిత్తశుద్ధిగల ఆరాధనం ఏలా వుంటుందోగూడ తెలియజేసారు. సాంఘిక న్యాయాన్నిపాటిస్తూ భక్తిగల హృదయంతో అర్పించేదే నిజమైన ఆరాధన. యెషయా ఈలా వచించాడు :
"మీ యొడలు కడుగుకొని శుద్ధిచేసికొనండి
ఇక నా యెదుట దుష్కార్యాలు చేయకండి
మీ పాపపుపనులనుండి వైదొలగి
సత్కార్యాలకు పూనుకొనండి
న్యాయాన్ని పాటించండి
పీడితులకు మేలుచేయండి
అనాథుల హక్కులు నిలబెట్టండి
వితంతువులను ఆదుకొనండి" - 1, 16-17
సీరా ఈలా ఆదేశించాడు :
"ధర్మశాస్త్రపు ఆజ్ఞలను పాటిస్తే
చాలా బలులు అర్పించినట్లే
దాని విధులను అనుసరిస్తే
సమాధానబలి సమర్పించినట్లే
ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తే
పిండిని నైవేద్యంగా అర్పించినట్లే
దానధర్మాలు చేసే
కృతజ్ఞతాబలి అర్పించినట్లే
దుష్కార్యాలుమానుకొంటే