పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనమే అరికట్టుకొంటూండాలి. పౌలు ఈలా తన్నుతాను శిక్షించుకొన్నాడు. కనుకనే "నా దేహాన్ని శిక్షించి అదుపులో పెట్టుకొంటున్నాను" అని చెప్పుకొన్నాడు - 1కొ9, 27 కనుక క్రైస్తవ నాయకుడు నానా రూపాల్లో తన్ను తాను శిక్షించుకొని తనలోని స్వార్ణాన్ని జయిసూండాలి, విశేషంగా పౌలు పేర్కొనిన "శరీర కార్యాలను" శిక్షించి అదుపులోనికి తెచ్చు కొంటూండాలి - గల 5, 19-21.

2. బాధలు

క్రీస్తు అననీయాతో పౌలును గూర్చి మాటలాడుతూ "పౌలు నా కొరకు ఎన్ని బాధలు అనుభవించాలో అతనికి తెలియజేస్తాను" అన్నాడు - అకా 9,16. ఈ పౌలు నాయకుళ్ళాగే క్రైస్తవ నాయకుడు గూడ క్రీస్తు కొరకు చాలా బాధలనుభవించాలి. అపుడు గాని అతడు ప్రజలకు ఏమైనా ఉపకారం చేయలేడు. స్వార్ణాన్ని చంపుకోవాలంటే బాధలు ఉపయోగ పడినంతగా మరే మందూ ఉపయోగపడదు.

3. బలహీనత

పౌలునకు చాలా శ్రమలూ బాధలూ కలిగాయి. ఈ వేదనలకు తట్టుకోలేక అతడు వాటిని తొలిగించమని ప్రభువుని ముమ్మారు ప్రార్థించాడు. కాని క్రీస్తు అతనితో "నీవు బలహీనుడవై యున్నపుడు నా శక్తి నీ మీద బలంగా పనిచేస్తుంది. నా వర ప్రసాదం నీకు తోడ్పడుతుంది, అది చాలుపో" అన్నాడు. పౌలు ఈ సత్యాన్ని బాగా జీర్ణం చేసికొని "నేను బలహీనుడనై యున్నపుడే బలవంతుడను" అని వ్రాసికొన్నాడు - 2కొ 12, 9-10. నాయకునికి స్వీయబలం చాలదు. అసలు స్వీయబలాన్ని అతడు లెక్కింపగూడదు. ఓ విధంగా చెప్పాలంటే, స్వీయబలం నశిస్తేనేగాని దైవబలం పనిచేయదు. మన శక్తిసామర్థ్యాల మీద నమ్మకం తగ్గిపోతేనేగాని, దైవశక్తి మనకు తోడ్పడదు. కనుక క్రైస్తవ నాయకుడు తన్నుతాను తగ్గించుకోవాలి, తాను బలహీనుణ్ణని నమ్మాలి. తన బలహీనతను తాను గుర్తించాలి, అంగీకరించాలి గూడ. అప్పుడుగాని అతనికి మించిన శక్తి అతనిమీద పని చేయదు.

పై పుటల్లో క్రైస్తవ నాయకుని కుండవలసిన లక్షణాలను కొన్నిటివి వివరించాం. బైబులు గ్రంథం నుండి ఉదాహరణలు చూపించాం, మన నాయకులు ఈ లక్షణాలను చిత్తశుద్ధితో మననంబేసికొని తమ నాయకత్వాన్నిసార్థకంజేసికొందురుగాక. ప్రస్తుతం మన దేశంలో ఉత్తమ నాయకులకున్న కొరత అంతింతగాదు. భారత క్రైస్తవ సమాజాలు కూడ చక్కని నాయకులు లేక అలమటిస్తున్నాయి. ఈ కొరతను తీర్చడానికి ఉదారబుద్ధితో ముందుకు వచ్చేవాళ్ళంతా మన క్రైస్తవ సమాజాలకు ఎనలేని ఉపకారంచేసిన వాళ్లాతారు.

"అర్థిప్పసుతో నీవు ప్రభువు నుండి పొందిన పరిచర్యను చక్కగా నిర్వర్తింప వలసిందని చెప్పండి" - కొలో 4,17.