పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. సోదరప్రేమ-2

బైబులు భాష్యం - 43

మనవిమాట


ప్రస్తుత సంచికలో నూత్నవేదం సోదరప్రేమను గూర్చి చెప్పే ముఖ్యమైన వాక్యాలను ఎన్నుకొని వాటివిూద సంగ్రహమైన వ్యాఖ్య చెప్పాం. ఈ వ్యాఖ్య ధ్యానాత్మకంగా వుండి అనుదిన ప్రార్థనకు ఉపయోగపడుతుంది. కాని పాఠకులు ఈ వ్యాఖ్యను చదివేపుడు ఇందులో ఉదాహరించిన వేదవాక్యాలను నేరుగా బైబులునుండి చదువుకొంటూండాలి. లేకపోతే ఈ వివరణం బోధపడదు.


క్రైస్తవ మతంలో కల్లా అతిశ్రేష్టమైందీ, అతికష్టమైందీ కూడ సోదరప్రేమే. ఈ చిన్ని పొత్తం ద్వారా ఈ ప్రేమ మన బైబులు భక్తులకు ఒకపాటిగనైనా ఆకళింపునకు వస్తుందని ఆశిస్తు

విషయసూచిక.

1.మత్తయి మార్కులూకా భావాలు 99

2. యోహాను భావాలు 106
1. యోహాను సువార్త 106
2. యోహాను మొదటి జాబు 108
3. పౌలు భావాలు 111


1. మత్తయి, మార్కు లూకా భావాలు

1. మంచివాళ్ళకీ చెడ్డవాళ్ళకీ కూడ సూర్యరశ్మి - మత్త 5,43-48


ఇతరులు మనతో ఏలా ప్రవర్తిస్తారో మనమూ వాళ్ళతో అలా ప్రవర్తించాలి అంటుంది పూర్వవేదం. కనుక ఇతరుడు మన కన్ను పోగొడితే మనం వాడి కన్ను పోగొట్టవచ్చు. ఇతరుడు మన పన్నురాలగొడితే మనమూ వాడిపన్నురాలగొట్టవచ్చు - లేవీ 2420. ఇది ప్రతీకార బుద్ధి శత్రువులను శిక్షించాలి అనే మనస్తత్వం. కాని నూత్నవేదం ఈ పద్ధతిని అంగీకరించదు. మిత్రులనీ శత్రువులనీ అందరినీ ప్రేమించాలని బోధించాడు ప్రభువు. ఈలాంటి విశ్వమానవ ప్రేమకు ఆదర్శం పరలోకంలోని తండ్రే.