పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ప్రేమ అసభ్యంగా ప్రవర్తించదు. ఇక్కడ అసభ్యమంటే మర్యాదను మీరిపోవడం. వెధవపనులు చేయడంగూడ, కొరింతీయులు ఈలాంటి అసభ్యపు పనులకు పాల్పడ్డారు. క్రైస్తవుల తగాలదాను క్రైస్తవేతరులు అధికారులుగా వున్న న్యాయస్థానాలకు తీసికొనివెళ్లారు - 1 కొ 6, 1-7. ఆరాధన సమయంలో తప్పత్రాగారు - 11, 2122. ఒకడు తన పినతల్లిని పెండ్లియాడాడు కూడ - 5,1-6, ఈలాంటి వెధవ పనులకు పౌలు వాళ్ళను చీవాట్ల పెట్టాడు. సోదరప్రేమ కలమానవుడు ఈలాంటి అసభ్యపు పనులకు పాల్పడదు. సభ్యతగా మర్యాదగా మెలుగుతాడు.

5. ప్రేమ తన స్వార్ణాన్ని తాను చూచుకోదు. స్వార్థమానవుడు ఇతరుల వలన తనకేమి ఉపయోగం కలుగుతుందా అని ఆలోచిస్తాడు. పరార్ధమానవుడు ఇతరులకు తానేలా ఉపయోగపడగలనా అని ఆలోచిస్తాడు. పౌలు సువిశేష సేవ చేసికూడ తన విశ్వాసులనుండి డబ్బు పుచ్చుకోలేదు - 1 తెస్ప 2, 9. అతడు ప్రతివాడూ ఇతరుల కార్యాలుకూడ చేసిపెట్టాలని చెప్పాడు - ఫిలి 2.4 ప్రతీవాడూ ఎదుటివాని మేలు తలపెట్టాలన్నాడు - 1 కొ 10, 24 క్రీస్తు తన్నుతాను సుఖపెట్టుకోకుండా మనకోసం ప్రాణాలర్పించాడు - రోమా 15,3. ఈలా నిస్వార్థజీవితం జీవించేవాడే ఉత్తమ క్రైస్తవుడు.

6. ప్రేమ సులభంగా కోపపడదు. కొరింతులో కక్షలున్నాయి. ఒకరంటే ఒకరికి గిట్టదు. పరస్పరవైరాలూ, వల్లమాలిన కోపతాపాలూను - 1కొ 1, 11-12. కాని ప్రేమగలవాడు ఈలా వుండడు, ఆవేశకావేషాలకు గురికాడు. నెమ్మదిగా శాంతచిత్తుడుగా వుంటాడు.

7. ప్రేమ అపకారాలను మనసులో పెట్టుకోదు. షావుకార్లు ఖాతాదారుల బాకీలన్నీ భద్రంగా పదుల పుస్తకంలో వ్రాసిపెట్టుకొంటారు. ఈలాగే కొందరు ఇతరులు తమకు చేసిన అపకారాలను గూడ జాగ్రత్తగా తమ మనసులో వ్రాసిపెట్టుకొంటారు. ఇక వాటిని మరచిపోరు. కాని ప్రేమకల నరుడు ఈలా చేయడు. అపకారులు తమకు చేసిన కీడులను వెంటనే మరచిపోతాడు. వారిని పూర్తిగా క్షమిస్తాడు. పూర్వవేదంలో ప్రభువు కూడ ఈలాగే చేసాడు. అతడు తన భక్తుల అపరాధాలను పూర్తిగా క్షమిస్తాడు-యెష 38, 17, నూతవేదంలో క్రీస్తుకూడ ఈలాగే తన శత్రువులను పూర్తిగా క్షమించాడు. కనుక సమయం దొరికినపుడు పగవాణ్ణి నొక్కివేయాలి అనుకోవడం, ప్రతీకారచర్యకు పూనుకోవడం, నిషురాలు పల్మడం, ఇతరుల అపరాధాలను స్మరించుకొని తనలో తాను ఉడికిపోవడం - ఈలాంటివన్నీ ప్రేమగలమానవుని లక్షణాలు కావు.

8. ప్రేమ ఇతరులకు కలిగిన కీడును గూర్చి సంతోషించదు, వారికి జరిగిన మేలును గూర్చి ఆనందిస్తుంది. ప్రేమలేని మానవుడు తన విరోధులకు ఏదైనా కీడు

94