పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జరిగితే ఆనందిస్తాడు. ఎవరైనా వాళ్ళను గూర్చి చెడ్డగా మాట్లాడితే విని సంతోషిస్తాడు. వాళ్ళకేదైనా మంచి జరిగితే సహించలేడు. కాని ఇది పద్ధతి కాదు. ఓమారు క్రీస్తు శిష్యుడు కానివాడొకడు క్రీస్తు పేరుమీదగా దయ్యాలను వెళ్ళగొట్టాడు. శిష్యులకది నచ్చలేదు. అతని విజయం వలన వాళ్ళకు కన్నుకుట్టింది. వాళ్ళ అతన్నితమ విరోధిగా భావించారు. కాని ప్రభువు శిష్యులను మందలించి ఆవ్యక్తిని తమ మిత్రునిగా భావించమన్నాడు – లూకా 9, 49-50. ఎలిసబెత్తు ప్రభువు అనుగ్రహానికి నోచుకొంది. ముసలితనంలో మగబిడ్డను కంది. ఆ సంఘటనకు ఇరుగుపొరుగువాళ్ళంతా ఆమెతో ఆనందించారు - లూకా 1,5758. కనుక ఇతరుల కీడునకు ఆనందింపనివాడు, వారి మేలునకు సంతసించేవాడు ప్రేమగలవాడు.

కడన, మళ్ళా ప్రేమలో కన్పించే నాలు లక్షణాలను చెప్పాడు - 13,7. అవి అపకారాలను భరించడం, నమ్మడం, నిరీక్షించడం, అన్నిటినీ సహించడం. ఈ గుణాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. ప్రేమ ఇతరులు తనకు చేసిన అపకారాలను భరిస్తుంది. వాళ్ళమీద సుమ్మర్లు పడదు. ఇతరుల దోషాలను ప్రచారం చేయదు. తల్లి బిడ్డ దోషాలను దాచివుంచినట్లే ప్రేమగల మానవుడు తోడినరుల దోషాలను దాచివుంచుతాడు. వాళ్ళ తనకు అపకారం చేసినా తాను వాళ్ళ తప్పిదాలను బయటికి పొక్కనీయడు. ఈలా ప్రేమ అన్ని అపకారాలనూ భరిస్తుంది.

2. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. ప్రేమగల మానవుడు ఇతరులను అనవసరంగా శంకింపడు, వారి మాటలనూ చేతలనూ నమ్ముతాడు. వారిపట్ల సదభిప్రాయం కలిగివుంటాడు. మనం ఎవరినైనా నమ్మకంతో చూస్తే వాళ్ళమీద వాళ్ళకే నమ్మకం కలుగుతుంది. పైగా వాళ్ళ మనకు నమ్మకంతో పనిచేసి పెడతారుకూడ కనుకనే ఇతరులను నమ్మడమూ, వారిమీద వారికే నమ్మకం కలిగేలా చేయడమూ ప్రేమకుండే లక్షణం.

3. ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది. ఒకోమారు ఇతరులు నమ్మదగనివాళ్ళగా వుంటారు. వాళ్ళవల్ల పనులుకావు. మోసం జరుగుతుంది. అలాంటప్పుడు గూడ ప్రేమగల నరుడు నిరుత్సాహపడడు. భగవంతుని కరుణవల్ల చివరికి అన్నికార్యాలూ మనకు మేలునే చేకూర్చి పెడతాయని నమ్ముతాడు - రోమా 828. ఈలా ప్రేమమానవుడు అన్ని కార్యాల్లోను మంచి జరుగుతుందని ఆశిస్తాడు.

4. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ఒకోమారు మనం నమ్మినవాళ్ళే మనలను ಮಂಗ್ಳಿಕ್ దోస్తారు. ఐనా అన్ని ఆశలూ మమ్మయి పోయినపుడు కూడ ప్రేమగల నరుడు క్రుంగిపోడు. మనసును కష్టపెట్టుకోడు. అతడు ధైర్యంతో అన్ని అపకారాలూ సహిస్తాడు.

95