పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

{{center|

3. ఆదిదంపతులు బైబులు భాష్యం-19

విషయసూచిక

1. విశ్వసృష్టి 42 2. నరుడు 45 3. నారి 48 4. ఏదెను తోట 50 5. శోధనలూ, పతనమూ 52 6. పాపమూ, శిక్షా 54 7. లోకరక్షకుడు 56 8. సంకేతాలు, వాటి భావమూ 57

1. విశ్వసృష్టి

1

. రెండు సంప్రదాయాలు

ఆదికాండంలోని తొలి మూడధ్యాయాలు రెండు భిన్న సంప్రదాయాలనుండి గ్రహింపబడ్డాయి. 1, 1 నుండి 2,3 వచనాల వరకు యాజక సంప్రదాయం. ఇది క్రీస్తుపూర్వం 6వ శతాబ్దికి చెందిన రచన. 24 నుండి 3,24 వరకు యావే సంప్రదాయం. ಇದಿ క్రీస్తుపూర్వం 8వ శతాబ్దికి చెందిన రచన. ఇక, ఐదవ శతాబ్దంలో వున్న ఓ రచయిత ఈ రెండు సంప్రదాయాలనూ ఐక్యంజేసి ప్రస్తుతమున్న రీతిగా ఆదికాండాన్ని తయారుచేసాడు.

2. ఆరురోజుల సృష్టి

యాజక సంప్రదాయం ప్రకారం దేవుడు ఆరురోజుల్లో సృష్టి చేసాడు. మొదటిరోజున వెలుగును కలిగించాడు. రెండవ రోజున నీటినీ, మూడవరోజున చెట్టుచేమలనూ, నాల్గవరోజున సూర్యచంద్ర నక్షత్రాలనూ సృజించాడు. ఐదవరోజు జలంలోని చేపలనూ, ఆకాశంలోని పక్షులనూ పుట్టించాడు. ఆరవరోజు భూమి మీది జంతువులనూ, నరుడ్డి సృజించాడు. ఈ విధంగా ప్రాణులన్నిటిలోను ఉత్తముడైన నరుణ్ణి ఆఖరిరోజున చేసాడు. కాని ఏడవరోజు ప్రభువు ఏపనీ చేయకుండా విశ్రాంతి తీసికొన్నాడు.

ఐతే దేవుడు ఈలాగ ఆరురోజులు సృష్టి చేసాడా? చేయలేదు. ఇది యాజక సంప్రదాయంవాళ్లు అవలంబించిన ఓ రచనా పద్ధతి, అంతే. యావే సంప్రదాయంలో