పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలిగించడానికి రచయిత ఈ గ్రంథం వ్రాసాడు. ప్రభువు తన భక్తులను నాశం కానీయడని ధైర్యం చెప్పాడు. ఈ పుస్తకంలో ప్రవచనానికి మారుగా దర్శనాల శైలి చోటుచేసికొంది. ప్రవక్త తాను చెప్పదల్చుకొన్న అంశాలను స్వయంగా దర్శనాల్లో చూచినట్లుగా చెపూంటాడు. యెహెజ్మేలుతోనే తలెత్తిన ఈ శైలి ఈ పుస్తకంలో శిఖరాన్నందుకొంది. ఈ గ్రంథానికి నూతవేదంలో దర్శనగ్రంథం ఉద్భవించింది. దానియేలు ప్రవచనం పూర్వవేదంలో "חכג&& 53) O&O ఉత్తానాన్ని పేర్కొంటుంది. దీనిలోని 7వ అధ్యాయంలో మనుష్యకుమారుని ఉదంతం వస్తుంది. నూత్న వేదంలో క్రీస్తు ఈ మకుటాన్ని స్వీకరించాడు.

చిన్నప్రవక్తలు 12 మంది

ఇక్కడ చిన్నప్రవక్తలు అంటే వీళ్ల పేరుమీదిగా ప్రచారంలోకి వచ్చిన గ్రంథాలు చిన్నవని అర్థం. వీళ్లు చెప్పిన సందేశం తక్కువ విలువైందేమీ కాదు. ఇక్కడ ఈ ప్రవక్తల గ్రంథాలను వాటిని బైబుల్లో అమర్చిన క్రమాన్నిబట్టి కాక, వాళ్ళు జీవించిన కాలక్రమాన్ని అనుసరించి పరిశీలిద్దాం.

ఆమోసు

ఇతడు 750 ప్రాంతంలో జీవించాడు. ఉత్తర రాజ్యమైన యిస్రాయేలుకు చెందినవాడు. మనకు తెలిసినంతవరకు ప్రవక్తలందరిలోను మొట్టమొదటిసారిగా గ్రంథరూపం తాల్చింది ఇతని ప్రవచనమే. ఆమోసు చదువుసంధ్యలులేని మొరటువాడు. గొర్రెల కాపరి. ఐనా ప్రభువు అతన్నే యెన్నుకొన్నాడు. అతని కాలంలో యిస్రాయేలు రాజ్యం సుఖభోగాలతో జీవిస్తూ పేదలకు అన్యాయం చేస్తూంది. కనుక ప్రవక్త ఈ విలాస జీవితాన్ని ఖండించాడు. పేదసాదలకు న్యాయం చేకూర్చమని ధనవంతులను హెచ్చరించాడు. ప్రజలు తమ బుద్దులు మార్చుకోకపోతే అస్సిరియారాజు దండెత్తివచ్చి వాళ్ళను శిక్షిస్తాడని చెప్పాడు. ఆ శిక్షాదినాన్ని "ప్రభువు రోజునుగా" గణించాలని వాకొన్నాడు. ఈతని ప్రవచనంనిండా ఈ దైవశిక్షను గూర్చిన బెదరింపులు కన్పిస్తాయి.

హోషియ

ఇతడు కూడ ఉత్తర రాజ్యానికి చెందినవాడే. ఆమోసుకు సమకాలికుడు. కాని ఆమోసు దైవశిక్షనుగూర్చి బోధిస్తే యితడు దైవప్రేమను గూర్చి బోధించాడు. ఈ ప్రవక్త భార్యయైన గోమెరు ఇతన్ని విడనాడి వ్యభిచారిణి ఐంది. కాని ప్రవక్త ఆమెను గాఢంగా ప్రేమించాడు. కనుక ఆమెను కొలదిగా శిక్షించి మరల స్వీకరించాడు. ఈ గోమెరులాగే యిస్రాయేలు ప్రజలుకూడ సీనాయి నిబంధనంద్వారా యావే వధువయ్యారు. కాని ఆ ప్రజలు ప్రభువును విడనాడి అన్యదైవాలను కొలుస్తున్నారు. అది వ్యభిచారంలాంటిది. కనుక ప్రభువు వాళ్ళను అస్పిరియా ప్రవాసంద్వారా శిక్షించి మరల తన ప్రజలనుగా