పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని ప్రభువు పిలుపునందుకొన్న పిదపనే గాని అతడు యిప్రాయేలీయులకు నాయకుడు కాలేదు. యావే అతనికి మండుతూవున్న పొదలో దర్శనమిచ్చి తన పేరునూ తన రక్షణప్రణాళికనూ తెలియజేసాడు. అతడు బానిసలైన యిప్రాయేలీయులను విడిపించుకొని రావాలని చెప్పాడు. అంతటి కార్యాన్ని నెరవేర్చడానికి నేనేపాటివాజ్ఞని మోషే జంకగా, భయపడకు నేను నీకు తోడైయుంటానని అభయమిచ్చాడు - నిర్గ 3, 11-12. మోషే నత్తివాడు. మాటనేర్పరి కాదు. కనుక ఫరోదగ్గరికి వెళ్లీ మాట్లాడ్డానికి జంకాడు. కాని ప్రభువు వాక్చాతుర్యంగల అహరోనుద్వారా ఆ కొరతను తీర్చాడు - 4,10ー14.

ఫరో మొదట మొండికెత్తి యిస్రాయేలీయులను పోనీయలేదు. కాని మోషే ప్రభువు సహాయంతో ఫరోను ఓడించి ప్రజలను బానిసం నుండి విడిపించుకొని వచ్చాడు. కనుక ప్రభువు అతన్ని నమ్మదగిన సేవకుణ్ణిగా గణించాడు. అతడు ఇతర ప్రవక్తలతో కల దర్శనాలద్వారా పరోక్షంగా మాట్లాడేవాడు. కాని తన దాసుడైన మోషేతో మాత్రం ప్రత్యక్షంగా మాట్లాడేవాడు - సంఖ్యా 12, 6–8.

మోషే ప్రభువు సేవకుడు మాత్రమే కాదు, స్నేహితుడు కూడ. నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే మోషే ప్రభువుతో ముఖాముఖి సంభాషించేవాడు. ఈలాంటి భక్తులు పూర్వవేదంలో ఎందరో లేరు - నిర్ణ 83, 11. ఇంకా ప్రభువు మోషేకు తన పేరునుగూడ తెలియజేసాడు. అతని పేరు "ఉన్నవాడు". బైబులు సంప్రదాయం ప్రకారం ఓ వ్యక్తి పేరును తెలిసికోవడమంటే అతనితో పరిచయం కలిగించుకోవడం, అతనిపై అధికారం నెరపడంగూడ, కనుక దేవుని నామాన్ని తెలిసికోవడం ద్వారా మోషేకు ప్రభువుపట్ల పరిచయమూ చనువూ కలిగాయనుకోవాలి — నిర్గ 3, 13-15.

2. విమోచకుడు, నిబంధన మధ్యవర్తి

ప్రభువు మోషేకు ఒప్పజెప్పిన మొదటి పని యిప్రాయేలీయులను దాస్యంనుండి విడిపించుకొనిరావడం. వారిని ప్రభువుని ఆరాధించే ప్రజలనుగా తయారుచేయడం. ఫరో ఈ యారాధనకు అడ్డమొచ్చాడు - నిర్ల 4, 22-23. కనుక దేవుడు మోషేద్వారా ఈజిప్టు మీదికి పది అరిష్ణాలు పంపాడు. చివరి అరిష్టంలో ఆ దేశంలోని తొలిచూలు మగబిడ్డలూ ఫరో కొడుకూ కూడ చచ్చారు - నిర్ణ 129. దానితో గుండె చెదరి ఫరో ప్రజలను పోనిచ్చాడు. ఆలా వెళ్ళకముందు మోషే ఈజిప్టులో పాస్కఉత్సవాన్ని జరిపించాడు. ప్రజలు యావేను పూజించారు. అటుపిమ్మట అతడు ప్రజలను రెల్లసముద్రం గుండా అవతలికి నడిపించాడు. ఫరోసైన్యం ఈ సముద్రంలోనే మునిగి చచ్చింది. మోషే మాత్రం ప్రజలను ఓ మందలాగ నడిపించుకొని పోయాడు - కీర్త 77, 19-20. ఆరీతిగా అతడు ప్రజలకు విమోచకు డయ్యాడు.

మోషే ప్రజలను తోడ్కొని వచ్చింది ప్రభువుని ఆరాధించడానికే. కనుక అతడు సీనాయి కొండదగ్గర బలి సమర్పించాడు. ప్రజలంతా అక్కడ దేవుణ్ణి పూజించారు. ఆ సందర్భంలోనే ప్రభువు మోషే మధ్యవర్తిత్వం ద్వారా ఇస్రాయేలియులతో నిబంధనం