పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


6. ఏలీయా

"ఏలీయ్యాహూ" అంటే యావే నాకు దేవుడు అని అర్థం. తన పేరు సూచించినటుగానే, ప్రజల్లో యూవేపట్ల భక్తి సన్నగిల్లిపోయినపుడు ఆ భక్తిని పునరుద్ధరించినవాడు యేలీయా. ఈ ప్రవక్తకు నిప్పతో సంబంధముంది. అతడు మంటలాగ పొడచూపాడు. అతని పలుకులు దివిటీలా మండాయి. అతడు మంటలతో గూడిన సుడిగాలిలో నిప్ప గుర్రాలు లాగే అగ్నిరథమెక్కిస్వర్గానికి వెళ్ళిపోయాడు - సీరా 48, 1,9.

1. ఎడారిలో దైవ సాక్షాత్కారం

ఏలీయా యెడారిలో దైవసాక్షాత్కారం పొందిన భక్తుడు. ఆరోజుల్లో అహాబురాజు బాలు దేవతను కొల్చేవాడు. ఏలీయా యావే భక్తుడు. కనుక అతడు రాజుతో ఘర్షణపడి అతనినుండి పారిపోయి ఎడారిలో కెరీతు వాగు దగ్గర దాగుకొన్నాడు. అక్కడ ప్రభువు ఆజ్ఞపై కాకులు ఆహారాన్ని తెచ్చి అతన్ని పోషించాయి, ఇది అతనికి కలిగిన మొదటి సాక్షాత్కారం - 1 రాజు 17, 2-7. అహాబు భార్య యొసెబెలు బాలు ఆరాధనను ప్రోత్సహించేది. ఏలీయా ఆమె పోషించే బాలు ప్రవక్తలను చంపించాడు. ఆ రాణికి భయపడి యెడారిలోకి పారిపోయాడు. అక్కడ దేవుడు అతనికి రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. దేవదూత అతనికి నిప్పలమీద కాల్చిన రొట్టెను ఇచ్చాడు. ఏలీయా ఆ రొట్టెలను భుజించి ఆ బలంతోనే నలభైరోజులు నడచిపోయి హోరేబు కొండను చేరాడు. ఆ పర్వతంమీద అతనికి మూడవసారి దైవసాక్షాత్కారం కలిగింది - 1 రాజు 19, 4–9. పూర్వం దేవుడు మోషేకు దర్శనమిచ్చిందిగూడ ఈ కొండమీదనే. ఈ విధంగా దైవదర్శనాలు పొంది యేలీయా యావే భక్తుడయ్యాడు. తాను జీవించినంత కాలం అపారమైన భక్తిశ్రద్ధలతో యావే మతాన్ని నిలబెట్టాడు. "ఎన్నాళ్లు మీరు ఈలా యిద్దరు దైవాలను పూజిస్తారు? ప్రభువు దేవుడైతే అతన్ని పూజించండి. బాలు దేవుడైతే అతన్ని పూజించండి" అని ఆనాటి ప్రజలను తీవ్రంగా మందలించాడు - 1 రాజు 18,21.

2. ప్రభువు భక్తుడు

ఏలీయా ప్రభువుని అనన్యచిత్తంతో కొలిచిన భక్తుడు. యావే మతంపట్ల అత్యాసక్తి కలవాడు - 1 రాజు 19, 10. ఈ యాసక్తితోనే అతడు అహాబురాజును ప్రతిఘటించాడు. అహాబు తండ్రి ఒమీరాజు సమరియా నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం భోగభాగ్యాలతో విరాజిల్లింది. ఆ రాజుకి విజయాలు సిద్ధించాయి. సిరిసంపదలు అబ్బాయి. కనుక పొగరెక్కి విగ్రహాలను కొల్చాడు. అతని కుమారుడైన అహాబు తండ్రిని మించిన విగ్రహారాధకుడు. అతడు తూరు రాజు కొమార్తెయైన యెసెబెలును వివాహమాడాడు. ఆమె పుట్టింటివారు బాలును కొల్చేవాళ్లు. కనుక ఆ రాణి యిస్రాయేలు దేశంలో బాలు మతాన్ని ప్రచారం