Jump to content

పుట:Bhasuni bharata natakamulu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22 భాసుని భారత నాటకములు


(దారపుత్ర సహితముగ వృద్ద బ్రాహ్మణుఁడు నిష్క్రమించు చున్నాఁడు.)

భీమ - హిడింబ! యిటు రమ్ము, కుమార! ఘటోత్కచ! నీవు నిటురమ్ము. పూజ్యుఁడైన కేశవదాసుని నాశ్రమ పదద్వారమాత్రము వఱకైన సాగనంపి సంభావింతము.

తే.గీ. అఖిల వాహినీ ప్రతతికి నబ్దివోలె
నాహుతులకెల్ల హవ్యవాహనుఁడు వోలె
మానవేంద్రియంబులకెల్ల మనసువోలె
మాకు భగవానుఁ డైన వామనుఁడు ప్రభువు.

(అందఱు నిష్క్రమించుచున్నారు.)

మధ్యమ వ్యాయోగము సమాప్తము.