పుట:Bharatiyanagarik018597mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాత డసమర్దుడగుటచే ప్రజలు శూరుడగు నొక రాజబంధువు నాశ్రయింపసాగిరి. అంతట రాజీతనని దేశమునుండి వెడలగొట్టెను. ఈ శూరుడు హిందూదేశమునకేగి యచటి రాజపుత్రి నొకయామెను పెండ్లాడి, జావారాజు మరణించిన పిమ్మట తానాదేశమునకు రాజుగా నేతెంచెను. ఇటుపై నీ పశ్చిమ జావా చరిత్రము దెలియుటలేదు.

మద్యజావా :- క్రీ. శ. 7 వ శతాబ్దమున మధ్యజావాలో నొక రాజ్యము నిర్మింపబడి త్వరలో బ్రసిద్దికెక్కెను. 674 నాటి కిచ్చట 'సోమా' యనురాజ్ఞి యేలికగనుండెను. ఆమె పరిపాలనమున బ్రజలు మిక్కిలి నీతిపరులుగను దర్మ బుద్దిగలవారుగ నుండిరనియు, నొకచోట నొకవర్తకునిచే బరీక్షార్ద ముంచబడిన బంగారపు పేటిక తిరిగి యావణిజుడు గైకొనువరకును మూడు సంవత్సరముల కాలమటులే యుండెననియు అరబ్ దేశీయులు వ్రాసియున్నారు. క్రీ. శ. 654 నాటి శాసనమొగటి యీ మధ్య జావాలో దొరికినది. ఇది సంస్కృతభాషలో పల్లవ గ్రంథలిపిలో వ్రాయబడినది. 'కుంజరకుంజ' యను పుణ్యక్షేత్రమునం దొక శివాలయము పునరుద్దరింపబడెనని యీ శాసనము దెలుపుచున్నది. ఈ రాజ్యమును బూర్వము నన్నహూడనునతడు మనువువలె నేలుచుండెనట. అతనివెనుక నాతని పుత్రుడగు సంజయుడు రాజ్యమునకు వచ్చెను. మహాపరాక్రమశాలియగు నతడు జావాద్వీపమునంతటిని జయించి, సుమాత్రా, బాలిద్వీపపాలకులవలనను, మలేద్వీపకల్పపు రాజుల వద్దనుండియు కప్పములను గొనెను.

ఇటుపై క్రీ. శ. 760 నాటి మఱియొక శాసనము గజయనుడను రాజుగూర్చి విశేషములను దెల్పుచున్నది. ఒకప్పుడు వర్షాభావము గల్గుటచే నీ రాజు తన పూర్వులు దేవదారు కఱ్ఱతో నిర్మించిన అగస్త్యమహర్షి విగ్రహమును జూచి నీలశిలతో దానికొక ప్రతికృతిని జేయించెను. పిమ్మట