పుట:Bharatiyanagarik018597mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుండెడివి. శాతవాహానాంధ్రులకాలమున వాణిజ్యమభివృద్దినందెను. టగర ప్రతిష్ఠాన నగరములందలి బజారులలో కృష్ణాగోదావరీనదులమూలమున విదేశములనుండి గొనితేబడిన మస్లినులును (Muslins) వర్ణవస్త్రములు నమ్మబడుచుండెడివి. పినాకినీముఖద్వారమును, మనర్ప కొట్టిన్, కృష్ణముఖద్వారములు, కొస్టకొప్పల, కొడ్డుర, అల్గొస్గైనిమున్నగు నౌకాశ్రయస్థానములను టాలెమీ పేర్కొనియున్నాడు. మనర్భ యనునది నేటి నెల్లూరుజిల్లాలోని మన్నేరుపైనున్నది. కొట్టిన్‌రేవు గుంటూరు జిల్లాలోని అల్లూరు కొత్తపట్టణమునకును, కొంటకోస్సల బందరువద్దగల ఘంటసాలకును, కొడ్డూర బందరువద్దనున్న్న గూడూరుకును, అల్లొస్గైని గోదావరీముఖద్వారమునకును సరియగుచున్నవి. ప్రాగ్భారతదేశమునందలి రేవులలో అరకాన్‌కు ముఖ్యపట్టణమగుత్రిలింగనగరమును, నయాంలోని కాకుళనగరమును, మలేద్వీపకల్పములోని సింహపురమును, బ్రహ్మపుత్రానదికిని అరకాన్‌కును నడుమగల పెంటపలిస్‌పట్టణము నాంధ్రదేశమునందలి శ్రీకాకుళమును, విక్రమసింహపురమును (Nellore) మోటుపల్లిని సూచించుచున్నవి. శాతవాహనులయొక్కయు బల్లవులయొక్కయు నాణెములపైనుండు నౌకాచిత్రములు విదేశీయసంబంధమును సూచనజేయుచున్నవి. ఈ విధమున నీసంబంధము దినదినాభివృద్ది నందినది.

అరకాన్ నయాందేశములలో వేంగీ చాళుక్యరాజులగు శక్తివర్మయొక్కయు, రెండవ రాజరాజుయొక్కయు నాణెములు దొరకుటచే క్రీ. శ. 12 వ శతాబ్దము వరకునుగూడ నాంధ్రదేశమున కీప్రాగ్భారతదేశములతో సంబంధముండినటుల దెలియుచున్నది. ఈ కాలమున నిట్టిసంపర్కమునకు లోనైన దేశముల చరిత్రము సంక్షేపముగా నీదిగువ వ్రాయబడుచున్నది.

(1) బర్మా :- బర్మాలోని పెగూతీరమునకు "కళింగ" మనియు, దాని కించుక బశ్చిమోత్తరముగనుండు భాగమునకు 'ఉత్కళ, మని