పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
70

అం 2]

భారత రమణి

ఇంతకన్న నాకేమి కావలెను? నేను బ్రహ్మచర్యము పూనెదను, దైవమా దీనినెట్లు నాచే నిర్వహింప జేసెదవో నీదేభారము.(సుశీల వచ్చును) చెల్లెలా శుభవార్త వింటివా?

సుశీ-- వింటిని, కాని ఇప్పుడట్లు జరుగనేరదు.

వినో--ఏది జరుగనేరదు?

సుశీ--నేనాతని పెండ్లియాడను.

వినో--చిత్రముగా నున్నదే! -- ఇంకెవని పెండ్లి యాదుదువు?

సుశీ--నాకు పెళ్లియే వలదు.

వినో--సరి సరి ఆడది పెళ్లిచేసుకోనకున్న నెట్లు?

సుశీ--ఆకాశము విరిగిపడునా? బ్రహ్మాండము బద్దలగునా?

వినో--అమ్మో! ఎంత మాటాడితివి ! మనదేశమున అనాదినుండియు ఆడది పెండ్లియాడుచునేయున్నది. ఇదే మన ఆచారము.

సుశీ--ఔను, నేనెరుగుదును. మన దేశమున ఆడవారి యెడ అత్యాచారము ప్రబలుట గనుచుంటివా? శ్రీరామచంద్రుని వంటివాడు ప్రజలను సంతసింపజేయుటకు నిరపరాధిని అగు ధర్మపత్ని నింటనుండి తరిమెను. అది ఉత్కృష్టమగు స్వార్ధ త్యాగమని అందరూ ఆ మహారాజును ప్రశంసింతురు. ప్రజలు కోఐనచో తన తల్లిని కూడ తరిమియుండును కాబోలు! సకల దర్మవేత్తయగు యుధిష్టురుడు మాయ దురోదరంబున మహా