ఈ పుటను అచ్చుదిద్దలేదు
రెం డ వ అం క ము
మొదటి రంగము (దేవేంద్రునిల్లు-దేవేంద్రుడు,సదానందుడు.)
దేవే--కేదారున కొక నెల కైదువిధింపబడునా?
సదా--అంతవరకు రాదు.పది పదిహేను రూపాయిలు జరిమానా పడవచ్చును ఐననేమి ? కేదారు డద్బుత వ్యక్తి సుమా!
దేవే--ఏల ?
సదా--'నీవు కొట్టితివా? అని న్యాయాధికారి అడుగ 'గట్టిగా కొట్టితిని ' అనెను. 'దానికి నీవుచింతింతువా?' అని యడుగ 'ఎంతమాత్రమూ చింతింపను; వీలున్నచో ఇంకొక సారి చితగగొట్టెదన ' నెను.
దేవే--పాపము! అతనికి నామూలమున కైదయ్యెను. నేను నాకూతురుని జంపుటకు కత్తినెత్త ఆవ్రేటుకు కేదారుడు తన వక్షమున కొనెను. తండ్రికి బలికాకుండ తనయును తప్పించెను.