పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
36

[అం1

భారత రమణి

గల్గుదును. సోదరుడును, నీకన్న చిన్నవడును, అర్భకుడ.. ఈ మేలు నాకు గూర్చుము.

ఉపే--దేవేంద్రా! ఐదువేల రూపాయిలు! అంత సొత్తు గూర్చుట మాటలతో తీరునా?

దేవే--కష్టము కావుననే నిన్నడిగితిని. మొదట కన్నెరు గన్న ఋణము గడవనిమ్ము.

ఉపే-- దేవేంద్రా! నీ కొక్క సులభమగు నుపాయము నుపదేశింతు... యజ్నేస్వరునకు సుశీలనిచ్చి యుద్వాహ మొనర్చుము. దాన నాత డసలును వడ్డియు నొకసారియే వదలుకొనును. అట్లొనర్చునటుల నతని నే నొప్పించెద. నామాట వినుము. నీకన్న నేను బెద్దవాడను... లేకున్న...దానవభంజనా! శ్రీహరే, మురారే !

దేవే-- అన్నా, అట్లు చేయమందువా?

ఉపే--ఉపాయాంతరమున్న నీవే చూపుము...వాని యెద్ద నమితధనమున్నది.

దేవే--సరే! అత డిక నంతకాలము జీవింపగలడు?

ఉపే--తదనంతరమున తద్దనమంతయు సుశీలకు సంక్రమించును. నీ కేచింతయు నుండదు. దేవేంద్రా ! బాగుగ నాలోచించు కొనుము. నీకన్న జ్యేష్ఠుడ, కావున నీ శ్రేయోభివృద్దికై యింత దూరము బోధించితిని, అమితధనమున కధీశ్వరుడ నగుదువు, అన్ని పీడలు నపసారితము లగును. కేశవా! మధునూదనా!