పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపోద్ఘాతము

ఆంధ్రమున సాంఘికనాటకములు చాలా తక్కువ. ఉన్నవాటిలోనైన ఆధునిక సమస్యాచర్చ అందముగా లేదు. ఈనాటకము కీర్తిశేషులు వంగనాటక కవిసార్వభౌములు నగు ద్విజేంద్రలాల్ రాయని తుదిరచన. వారు దీనికి "వంగనారి" అను పేరిడ, అనువాదకులగు బొంబాయి హిందీగ్రంథరత్నాకరమువారు "భారతరమణి" అని నామకరణము చేయుటచే మే మీపేరే పెట్టితిమి.

ఇందు ఆధునికాచారములగు వివాహము, శుల్కము, స్త్రీవిద్య, సముద్రయానము, బహిష్కారము మొదలగునవి చర్చింపబడినవి కావున చదువరుల కిది అమితసంతోషదాయకమగునని విశ్వసించు చున్నాము.