పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
32

అం1]

భారత రమణి

అప్పుడే మెత్తగా చితుకగొట్టవలసినది ఎందుకు మరచితివా అని యిప్పుడు చింతించునున్నాను, తులువ ! లండి ! పలువ !

దేవే-- కేదారా! అంత క్రుద్ధుడ వయ్యెదేల?

కేదా--క్రోధమా ! దౌర్భగునికి మూడుపాళ్ళా యువు చెల్లినది, కాటికి కాలుదాచుకొని యున్నాడు, బికారి! కూళ ! సుశీలను-తనకిచ్చి పెళ్ళీ చేసినచో, అసలును వడ్డీయు వదలుకొనునట తొత్తుకొడుకున కింత పొగరా? నెత్తి పగులగొట్టనైతిగదా అని విచారించుచున్నాను. యజ్నేశ్వరుడు తలచుకొనిన నా కరికాలైమంట నెత్తి కెక్కుచున్నది. దిక్కులేని పీనుగ, పశువు కని మానవుడా?

హరి--కేదారా! తగు మంష్యుని తూలనాడెదవేల?

కేదా--ఏమో నాకే తెలియదు తిట్టక మానను. నీచుని నీఛుడనుట నాస్వబావము ఏమిచేయుదును?

నవీ--కాని

కేదా-- నీవు నోరు మూసుకొనుము తగుదునమ్మా అని చెప్పవచ్చెదవు...మీరు వందిమాగధులు. చెప్పులు మోయు చెనటులు. పోయి వాని కాళ్ళపై బడి దుమ్ం తలధరింపుడు. మీరెక్కడచేరిరేమి! దేవేంద్రా! వీరి నిటనుండి త్వరలో సాగనంపుము. ఈ పాపులు ఏదో దుస్తంత్రము పన్ని నిన్ను మోసగింపు టకు వచ్చిరి. శీఘ్రమే వీరిని గెంటి వేయుము.

దేవే-- కేదారా ! అట్ల నరాదు. తగు మనుష్యులు