పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

31

భారత రమణి

దేవే-- అప్పు తీరు నుపాయము ఇంతవర్కును నాకు తొచనేలేదు.

శంకరముదావా చేయవలెనని అతనికి లేదు, కాని ఏమి చేయగలడు?

దేవే-- నిజమే?

నవీ--ఆ చిక్కు వేగము వదల్చుకొనుట మేలు; దావా పడినచో ఖర్చులు కూడ తగులు కొనును.

దేవే-- అదియే ఆలోచించు చున్నాను. కాని సొమ్మెక్కడి నుండి తేగలను? నాకేమియు పాలుపోలేదు. ఇల్లు వాకిలి, పాత్రసామాను అమ్ముకోవలయు, సాధనాంతర్ము తోచకున్నది, మ్మత వీడకున్నది. పిత్రార్జితము.....

హరి-- ఇంకొక చిక్కున్నది. అప్పు తీరుటతో సరిపోదు. అమ్మాయి పెండ్లికి సిద్ధముగా నున్నది. దానికి ధనము కావలయు కావున

దేవే--నిజమే

హరి--'ఏకక్రియా ద్వ్యర్ధకరీ ' అన్నాడు కాబట్టి నీ కూతురిని... ఇదిగో- యగ్నేశ్వరుడు...(కేదారుడు వచ్చును)

కేదా--గాడిదె కొడుకు మారువాడీలను మించినాడు. ఒక దమ్మిడియైన వదలడట! పిసినిగొట్టు పీనుగ- అధమాధముడు.. ఇంకే మందును ? వానికి 'కుష్టురోగముపై గుఱుగుఱు పుట్టి ' నట్లున్నది. ఇంత పొగరా ! లుచ్చా ! దూబ!