పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రం 2]

భారత రమణి

161


ఉపే-- అయ్యా! నేనొర్చిన పాపపుంజము నీవెరింగినచో --రెండేండ్లు కాదు. రెండువందలేండ్లు శిక్ష ననుభవించినను నాపాపము తరుగబోదని నీవెంతువు. నేనేమి చేసితినో నీ వెరుగుదువా!

చెఱ-- ఎరుగ కేమి? మోసము చేసితివి.

ఉపే-- అయ్యో! ఇదేనా నీవెరిగినది? ఏమియు నెరుగని అనాథబాల మానము మాప నెంచితిని, అమాయికుడు ఋజుమార్గవర్తియు నగు సోదరుని మోసగించి ధ్వంసము చేయనెంచితిని; రక్తమాంస సంబంధమును తాఱుమాఱు చేసి, దానికి తిండిపెట్టక చంపితిని. అది సన్నిపాతరోగముచే సమయలేదు, అన్నపానములు లేక అలసి మడిసినది. అయ్యో !

చెఱ-- ఎవరు?

ఉపే-- నాభార్య! దానికి మాతండ్రి వ్రాసిన వీలుబోగట్టా తెలియును, అది బైటపెట్టునను భీతిచే దానికి విషమిచ్చి చేతులార చంపుకొంటిని, నిద్రలో నాకంటి కేది కట్టుచున్నదో ఎరుగుదువా?

చెఱ--చెప్పు చెప్పు.

ఉపే--ఈ పాపమంతయు నా తలగడ నిల్చి, నా వైపు చూచుచు, నానెత్తిపై నాడుచున్నది... అన్నిటికన్న ఘోరతమమగు పాప మింకొకటి కలదు. నా పాపజాలమును భగన్నామమను తెఱమరుగున దాచి బకధ్యానము చేయు