ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఐ ద వ అం క ము
మొదటి రంగము
(దేవేంద్రు నింటిలో దేవేంద సదానందులు.
దేవే--తాతలనాటి యిల్లు తరలిపోయెను, ఇమ కర్ర కంప మిగిలినవి. అవికూడ అమ్మి అప్పుతీర్చి, కౌపీనధారినై ఊరూర "భవతి, భిక్షాం దేహి" అని సంచరించెదను. సీతారామాభ్యాం నము.
సదా--దేవేంద్రా, కుశలమా! ఏమి చేయుచుంటివి!
దేవే--కుశాలమే- కూర్చుంటిని
కొనువారు వచ్చెదరు
ఓహో, వచ్చితిరా! రండు. ఇదిగో మంచము, కుర్చి, వీటి కేమిచ్చెదరు?
సదా--ఏమి దేవేంద్రా! పిత్రార్జితమగు సామగ్రి నమ్ము చుంటివా? ఇదెంత శ్రేష్టము !
దేవే--దాని నుంచుకొనుటకన్న పితృణవిముక్తుడ నగుట శ్రేష్టమని నా యూహ. సదానందా, అడ్డు రాకు, అయ్యలారా! పలుక రేమి?