పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
126

[అం 4

భారత రమణి

విన-- విద్యాభ్యాసమున విపర్యానము సంభవించునా! విద్యావంతులందరును స్వతంత్ర్యము బూన నెంతురా?

సదా--ఇప్పుడు ప్రత్యక్షము కాలేదా?

విన--ఆంగ్లవనితలు.. ... ...

సదా-- నాయనా! వారిమాట యెత్తకు, ఐదువందల లేడ్లనుండియు వారు విద్యాభ్యాస మొనర్చుచున్నారు. కావున వారికది స్వాబావికాచార మైనది. వారిలో నందరును చదువుకొన్నవారే, అందుచే విద్యాగర్వ మునకు వీలులేదు. విద్యావతు లౌట వారు వినయసంపన్నులగుదురు. మనదేశమున విద్యనేర్చిన వనిత నూటికొకతె. అందును పట్టపరీక్ష యిచ్చిన పడతిని పట్ట పగ్గముండదు, అమి తాహంకారము! స్త్రీసామాన్యమగు, అశక్తకు విద్య యొసగు దుస్సర్వజ్ఞత్వము తోడగును, కన్నులు నెత్తికెక్కును, భూమిపై అడుగు పడదు, క్రిందనున్న పంటలుండవు, మీదన్నున్న వర్షము లుండవు.

వినో--సుశీల చేసిన పని నింద్యమనియా మీ యభిప్రాయము?

సదా-- కొంతవరకు నింద్యమే పెద్దలయెడ భయభక్తి శ్రద్ధలతో మొలంగుట స్వతస్సిద్దమగు సుగుణము. తలిదండ్రుల చెప్పుచేతలకు లొంగని వారి భావి శుభావహము కానేరదు.

సదా--పెద్దల మాటలు పెడచెనిని బెట్టిన పడతులు మనదేశమున లేరా!