పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
116

అం 2]

భారత రమణి

::ఏ డ వ రం గ ము::

(ఉపేంద్రు నింటిలో అతడు, వినోదిని)

వినో--బాబయ్యగారూ, నన్నింటికి పోనిండు, నా పల్లకిబోయీల పిలువనంపుడు; నేను పోయెదను.

ఉపే--కలవర పడెదవేల? నీకు భయములేదు.

వినో--మీదు భయములే దనుటచేతనే నాకు దిగులు కలుగుచున్నది. మీస్వరము గద్గద మౌచున్నది. దృష్టి మారినది, ముఖము వెలవెలబరు చున్నది. మీ చందమొప్పటివలె నుండక మారిపోయినది.

ఉపే--నీకు భయము వలదు, నామాట నమ్ము

వినో--అదిగో మీనాలుక తడబడుచున్నది. నాకు భీతి కలుగుచున్నది. నన్ను కొట్టినను, తిట్టినను, ఇంటినుడి తరిమినను, ఇంకేమి చేసినను, అతడు నన్ను కన్నతండ్రికదా? పుట్టినిల్లుసాటి భువినుండబోదు! పల్లకిబోయీల పిలిపించుము లేకున్న నడచి పొవుదును. (బైటకి పోబోవును)

ఉపే--నీవిట నుండుము, నేను పోయి వారిని పిలుచుకొని వచ్చెదను.

వినో-- నేనుకూడ మీవెంట వచ్చెదను.

ఉపే--ఏల?

వినో-- ఇక్కడ నే నొంటరిగా నెట్లుందును? మీరెట్టి వారైనను నాకు పితృవ్యులు కదా? నేను మీబిడ్డను.