పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
98

[అం 3

భారత రమణి

యజ్నే-- అటులనా? మీతండ్రి వ్రాసిన 'విల్లు 'లో నేను సాక్షిసంతకము చేసితిని, జ్ఞప్తి యున్నదా?

ఉపే--ఆ"విల్లు" ఇప్పు డెక్కడ నున్నది?

యజ్నే--లేకేమి? చేన అలమరలో నున్నది. పోలేదు.

ఉపే--సరిసరి.

యజ్నే--సరిలేదు, బేసిలేదు, అదేయున్నచొ దేవేంద్రుని కగపడదా అని సంశయించుచుంటివి కాబోలు! చెప్పెద విను అందులో గొంగ అరయున్నది. ఆ సంగతి నాకు తప్ప వేరెవ్వరికి తెలియదు. అలమర యిప్పుడు దేవేంద్రుని యెద్దనే ఉన్నది. నేనిప్పుడే పోయి వానితోచెప్పెదను. సొమ్ము రాబట్టు నుపాయము నాచేతిలో నున్నది. ఆ "విల్లు" ప్రకారము యావదాస్తిలో మూడుపాళ్లు దేవేంద్రునకు ఒక పాలు, నీకునువచ్చును, సొమ్మిచ్చెదవా? లేదా? చెప్పు.

ఉపే--రెండవ "విల్లు" నందు నీవు సంతకము చేయలేదా?

యజ్నే--నేను చేయలేదనియు నీవే నాసంతకము చేసితి వనియెద.

ఉపే--నీమాట నమ్మువారెవరు?

యజ్నే--తండ్రివ్రాలు చేయగలవాడు సాక్షివ్రాలు చేయలే దనుకొందురా? చెప్పు, సొమ్మిచ్చెదవా? లేదా?

ఉపే--నాకు మిత్రుడవయ్యు ఇంత ఘోరమునకు ఒడిగట్టుదువా?