బొమ్మలరాణి
మీనాక్షి లేచి కూర్చుంది.
"ఈ కొత్త బొమ్మలాట లోకి నన్ను దింపుతారా యేవిటి నాయుడుగారు?"
"మీనూ, మీనూ! నా కుటుంబం యావత్తూ వదిలి వేశా. నా తల్లినీ, వాళ్ళనూ చూసి యేడా దయింది. నీ దాసానదాసుణ్ణి. నా ఈ జన్మ భయంకరమైన వట్టి ఎడారిని చేసినా, పరమ పవిత్రాలైన హిమాలయభూములు చేసినా నీ చేతిలోనే వుంది."
కామేశ్వర్రావు మంచము దిగి ఆమె పాదాల కడ మోకరిల్లి ఆమె వళ్ళో తలపెట్టుకుని ఆమె నడుంచుట్టూ తన రెండుచేతులూ చుట్టి "నా జన్మం పవిత్రం చేసిన దేవిని ఉద్భవించుకున్న నాకు కృపావరము దొరకదా?" అని అన్నాడు.
మీనాక్షి దృగంచలాల నుండి వేడి చుక్కలు కామేశ్వర్రావు తలపై పడ్డాయి.
"మీరు అద్భుతమైనటువంటి నూతన ప్రపంచంలోకి తీసుకువచ్చినారు నన్ను. గడ్డిపోచను దవనపుమొక్కగా చేశారు. నా చర్మం మీ కాళ్ళకు జోళ్లు కుట్టి యిచ్చినా నా బాకీ తీర్చుకోలేను."
"ఒట్టి బాకీయేనా?"
కామేశ్వర్రావు చటుక్కున లేచి ఆమె బుజాల మీద తన రెండు చేతులూ వేసి ఆమె వేపుకు దీనంగా చూస్తూ ప్రశ్నించాడు. ఇంతలో తలుపు తోసుకొని వీరయ్య, కామే
95