పుట:Bhagira Loya.djvu/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
'బాపిరాజు'
 

ఆమె మంచంపైన మెత్తని దిండులోకి మొహందూర్చి తల యెత్తకుండా పడుకుంది. కామేశ్వర్రావు గదితలుపు చేర వేశాడు. ఆ బాలిక దేహసౌభాగ్యకాంతులు, ఆనందరేఖల వంపులుపోతూ, ఆ సన్నని తెల్ల పట్టుచీరలోంచి ప్రతిఫలిస్తున్నవి. ఆమె యౌవనము పూర్ణత దాల్చి ఆమె సౌందర్యానికి యింకా వన్నె తెచ్చింది. కామేశ్వరుని హృదయము వెర్రి ఆశ లో మునిగింది. ప్రేమపూర్ణతచే ఆతడు తూలుతూ పోయి మంచం పై పడుకునివున్న మీనాక్షిపై సుందరేశ్వరునిలా వాలాడు. ఆమెను తన బాహువుల్లోకి మింగివేసుకొన్నాడు. ఆమె కర్కశత్వము దాల్చి ఆతని బాహువుల్లో కఱ్ఱ వలె బిగుసుకొని పోయింది.

కామేశ్వర్రావు ఆశ్చర్యపడి

"మీనా ! నే నంటే నీ కాపేక్షలేదా?" అన్నాడు.

"........................."

"ఈ మూడేళ్ళనించి నా హృదయంలో ఒక దేవాలయం కట్టుకుని అందులో నిన్ను పెట్టి పూజ చేస్తున్నాను. ఆ రోజున మా ఊళ్ళో బొమ్మలాటలో నీ గొంతుకు విన్నప్పటినుంచీ..."

కామేశ్వర్రావు తన కౌగిలింత లోంచి ఆమెను వదలి ప్రక్కను కూర్చున్నాడు.

"ఆనందంలేని నా జన్మకు ఆనందం యిచ్చావు, మీనూ! నీ ప్రేమ అనే అమృతంతో నన్ను దివ్యుణ్ణి చేశావు."

94