Jump to content

పుట:Bhagira Loya.djvu/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

తీసుకొస్తాననిన్నీ, అందువల్ల లోకప్రఖ్యాతిన్నీ, మిక్కుటమగు ధనమున్నూ వీరయ్యకు చేకూరుతాయనీ కామేశ్వర్రావు వాళ్లకి నచ్చ చెప్పాడు.

అప్పుచేసి ఒక అయిదువందల రూపాయలు తెచ్చాడు. అవి ఖర్చు పెట్టి పురాతన భారతీయ సంప్రదాయాలైన అజంతా, మొగలు, రాజపుత్రపద్ధతులలో జపాను, టిబెట్టు, పారశీక, పాశ్ఛాత్య సంప్రదాయాలు సమ్మిళితం చేసి, నూతనంగావచ్చే "వ్యంజ" (Impressionism), "కోణ" (Cubism) మొదలైన రీతులను యిముడ్చుకుంటూ, కొత్త రీతులు కల్పించుకుంటూ, ఉద్భవించిన నూతన భారతీయ చిత్రలేఖన సంప్రదాయ ప్రకారంగా రామాయణ భారత కథలకు, భాగవతంలోని శ్రీకృష్ణునికథకూ, సంధ్యాతాండవం మొదలైన శివగాధలకూ సరిపడే చిత్రాలు వీరయ్య చేత, ఆ ఆంధ్ర చిత్రకారకుని సలహాతో తయారు చేయించాడు.

ఉదయశంకరుడు తన నాట్యానికి ఉపయోగిస్తూ వున్న సంగీతపు హంగుపద్ధతిని కామేశ్వరుడు అవలంబించి గొట్టు, వీణ, వాయులీన (Violin), మహావాయులీన (Violin-cella), తంబూరా, చితారు, ఇస్రాజ్ మొదలైన వాద్య విశేషాల్ని వాయించే వాళ్ళను పోగుచేశాడు.

91