పుట:Bhagira Loya.djvu/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

జనుల కోసం గంధోళిగాడు, కేతిగాడు, అల్లాటప్పగాడు తెరమీద విజృంభించారు. కాని జాగ్రత్తగా చూస్తే పెద్దపెద్ద పాత్రలకు గంభీరమైన అభినయం, చిన్నపాత్రలకు వాటికి తగిన నటన మాచిత్రంగా వుంటుందండి. రామచండ్రుడు చెయ్యి మాత్రం కదుపుతాడు. లక్ష్మణుడు తలకూడా తిప్పుతాడు. ఆంజనేయులు మొదలైనవాళ్లు దేహమంతా కదుపుతూ అభినయం చేస్తారు. రాక్షసులు గడబిడ దడబిడగా బల్లల చప్పుడు, బూరాల మోతలతో నీడల్లా వచ్చి రూపం పొంది, మళ్లీ పొగలా అయి మాయమవుతారు. తమ రాశీర్వాదిస్తే ఉదయశంకరుడు నాట్యకళను పునరుద్ధరించి నట్లున్ను, రవీంద్రుడు నాటకకళకు కొత్తపద్ధతిగ తిరిగి జీవం పోసినట్లున్ను, ఈ తోలుబొమ్మలాట కూడా మార్చి ఉత్తమ హృదయులు మెచ్చుకునేటట్లు చేద్దామని వుందండి.

కజిన్సు -- మీ భావం, ఆశయం చాలా బావున్నాయి. నాకు చేతనయినంత సహాయం చేస్తాను.

12

భారతీయ సంప్రదాయమైన చిత్రలేఖనము నేర్చుకుని ప్రసిద్ధికెక్కిన ఒక ఆంధ్ర చిత్రకారకుని కామేశ్వర్రావు చేరదీసాడు.

వీరయ్యతో, విఠలుడితో చాలారోజులు తర్జభర్జన చేశాడు. తోలుబొమ్మలాట విద్యలో తాను గొప్ప మార్పులు

90